News January 31, 2025
పెద్దపల్లి: చివరి ఆయకట్టుకు ఎస్సారెస్పీ నీళ్లు: ఎమ్మెల్యే

డి 83 ఎస్‌ఆర్ ఎస్‌పి కాల్వ 22 ఆర్ నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్ పల్లి గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఎస్ఆర్ఎస్పి కాలువను ఆయన పరిశీలించారు. మండలంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు రూ.50 లక్షలు ఖర్చుపెట్టి పూడిక తీయించామని తెలిపారు.
Similar News
News February 17, 2026
శుక్ర మౌఢ్యమి ముగుస్తోంది కానీ!

ఈరోజుతో శుక్ర మౌఢ్యమి ముగియడంతో శుభకార్యాలు మొదలవనున్నాయి. అయితే ఈ మంచి రోజులు మే 9 వరకు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ కాలంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధం. అలాగే మే 4 నుంచి 29 వరకు కర్తరీ దోషం ఉంది. ఈ సమయంలోనూ శుభకార్యాలు చేయరు. దీంతో మే నెలలో గృహారంభం, గృహప్రవేశం వంటి పనులు చేయరాదు. కాబట్టి ఈ లోపు మీ పనులు ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం.
News February 17, 2026
కర్నూలు: అడవిలో మహిళ హత్య.. సంచలన తీర్పు!

గోనెగండ్ల మండలం బి.అగ్రహారం గ్రామానికి చెందిన దేవదాసుకు బైలుప్పలకు చెందిన లక్ష్మిని హత్య చేసిన కేసులో సోమవారం జీవిత ఖైదు పడింది. 2021లో మహిళ కనిపించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ముద్దాయిని అరెస్ట్ చేసి విచారించారు. కసాపురం సమీప అటవీ ప్రాంతంలో హత్యచేసి శవాన్ని కాల్చినట్లు వెల్లడైంది. కేసును విచారించిన ఆదోని 2వ అదనపు జిల్లా జడ్జి నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధించారు.
News February 17, 2026
TU: L.L.B 5వ సెమిస్టర్ పరీక్షలు ఎప్పటినుంచంటే!

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని LLB 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్ ను COE ఆచార్య సంపత్ కుమార్ సోమవారం విడుదల చేశారు. ఈ నెల 23 నుంచి మార్చ్ 4 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గం.ల నుంచి 5గం.ల వరకు జరగనున్నాయన్నారు. విద్యార్థులు మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ ను సందర్శించాలని తెలిపారు.


