News February 24, 2025

పెద్దపల్లి: జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతి

image

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో సర్కారు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఆరోగ్య బీమా, రైల్వే పాస్, కొత్త అక్రిడిటేషన్ కార్డులు అందించాలని కోరారు. నిత్యం వివిధ రాజకీయ నాయకులు జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని, వారి కోసం ప్రత్యేక చట్టాలు తేవాలని కోరారు.

Similar News

News February 24, 2025

CHECK NOW.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా?

image

‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం నిధులను ప్రధాని మోదీ ఇవాళ విడుదల చేశారు. ఈ పథకం కింద ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున రూ.6వేలు జమ చేస్తారు. ఇవాళ దేశంలోని 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున రూ.22వేల కోట్లను జమ చేశారు. E-KYC పూర్తైన వారి అకౌంట్లలోనే డబ్బులు జమ అయ్యాయి. మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో ఇక్కడ <>క్లిక్ <<>>చేసి తెలుసుకోండి.

News February 24, 2025

రామతీర్థంలో శివరాత్రికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26 నుంచి జరిగే శివరాత్రి జాతర ఉత్సవాలకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సీఐ రామకృష్ణ, ఎస్ఐ గణేశ్‌తో కలిసి రామతీర్థంలో ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. క్యూలైన్లు, వాహనాల పార్కింగ్, ప్రసాదం కౌంటర్లు తదితర ఏర్పాట్లను పరిశీలించి, సూచనలు చేశారు. ఏర్పాట్లపై ఆలయ ఈఓ శ్రీనివాసరావుతో చర్చించారు.

News February 24, 2025

జగిత్యాల: రేపట్నుంచి ప్రచారం నిషేధం: కలెక్టర్

image

MDK, NZB, KNR, ALD పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా ఈ నెల 25 సాయంత్రం 4.00 నుంచి ఈ నెల 27 సాయంత్రం 4.00 వరకు బహిరంగ సభలు, ఊరేగింపులు సమావేశాలు నిర్వహించడం, ప్రచారం చేయడం, బల్క్ ఎస్ఎంఎస్‌లు పంపడంపై నిషేధమన్నారు.

error: Content is protected !!