News July 7, 2025
పెద్దపల్లి జిల్లాకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈనెల 9 వరకు పెద్దపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీటి వనరులు, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు అవసరమైతే తప్ప అత్యవసర ప్రయాణాలు చేయాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.
Similar News
News July 7, 2025
మెదక్ జిల్లా విద్యుత్తు శాఖ ఎస్ఈగా నారాయణ నాయక్

మెదక్ జిల్లా విద్యుత్తు శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ)గా నారాయణ నాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా విద్యుత్తు శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహించిన శంకర్ గత నెలలో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న నారాయణ నాయక్ నియమితులయ్యారు.
News July 7, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం సర్దార్ కాటన్ బ్యారేజీలో ఈ నెల 12వ తేదీ నాటికి 9 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు చేరే అవకాశం ఉందని, అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.
News July 7, 2025
నల్గొండలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..!

నల్గొండలో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు వన్ టౌన్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ యువకుడు, ఇద్దరు మహిళలని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కలెక్టర్ ఆఫీస్ వెనకాల ఓ ఇంటిని కిరాయికి తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న వ్యవహారంపై నిఘా పెట్టారు. నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు మెరుపు దాడులు చేసి పట్టుకున్నట్లు సమాచారం.