News March 10, 2025
పెద్దపల్లి జిల్లాకు రూ.200 కోట్లు..!

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా పాఠశాలలు నిర్మిస్తున్నామన్నారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలోని మంథనికి రూ.200కోట్లు మంజూరు చేశారు.
Similar News
News March 10, 2025
మీ ఊర్లో నీటి సమస్య ఉందా?

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సత్యసాయి జిల్లాలో 36°Cల ఉష్ణోగ్రత నమోదవుతోంది. పలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి సమస్య మొదలవుతోంది. ఈ ఏడాది నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో 427 పంచాయతీలు ఉండగా నిధులు రాగానే ఉండగా సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా, బోర్ల మరమ్మతులు, నూతన పైప్‌లైన్ పనులు చేపట్టనున్నారు. మరి మీ ఊర్లో నీటి సమస్య ఉందా? కామెంట్ చేయండి.
News March 10, 2025
జియో కొత్త ప్లాన్.. రూ.100తో..

ఓటీటీ వ్యూయర్ల కోసం రిలయన్స్ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.100తో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 5GB డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 90 రోజులు ఉంటుంది. హాట్‌స్టార్ ఫోన్ లేదా టీవీ ఏదైనా ఒకదానిలో ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్లో ఎలాంటి వాయిస్ కాలింగ్ ఉండదు.
News March 10, 2025
ఆ రైతులకూ రూ.20వేలు: మంత్రి అచ్చెన్న

AP: అర్హులైన ప్రతి రైతుకు ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.20 వేలు ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి బ్యాంకుల్లో జమ చేస్తామని వెల్లడించారు. కౌలు రైతులు, వెబ్ ల్యాండ్‌లో నమోదైన వారికీ పథకం వర్తిస్తుందన్నారు. మరో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. రూ.30 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తెచ్చామన్నారు. 16 రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని వివరించారు.