News December 15, 2025

‘పెద్దపల్లి జిల్లాకు సెమీకండక్టర్ యూనిట్ ఇవ్వాలి’

image

జిల్లాకు సెమీకండక్టర్ యూనిట్ ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు వినతిపత్రం ఇచ్చారు. పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సెమీకండక్టర్ ఇండస్ట్రీకి సరిపడా వనరులు, స్కిల్డ్ యువత జిల్లాలో ఉన్నారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లానని ఎంపీ పేర్కొన్నారు. గతంలోనే పెద్దపల్లికి రావాల్సిన ఇండస్ట్రీని చంద్రబాబును సంతోష పెట్టేందుకు APకి తరలించారన్నారు.

Similar News

News December 16, 2025

MBNR: సౌత్ జోన్.. ఈనెల 19న టేబుల్ టెన్నిస్ ఎంపికలు

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు వర్సిటీ నుంచి సౌత్ జోన్ ఆలిండియా టేబుల్ టెన్నిస్ పోటీల్లో పాల్గొనే జట్ల ఎంపికలను ఈ నెల 19న నిర్వహించనున్నట్లు వర్సిటీ పీడీ డా. వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. వయస్సు 17-25 ఏళ్లలోపు ఉండాలని, క్రీడాకారులు బోనఫైడ్, టెన్త్ మెమో, ప్రిన్సిపల్ సంతకంతో కూడిన ఎలిజిబిలిటీ ఫామ్ తీసుకురావాలన్నారు. ఎంపికలు యూనివర్సిటీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉంటాయన్నారు.

News December 16, 2025

పెద్దపల్లి: ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పంచాయితీ ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడో విడత పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 17న జరుగుతాయని తెలిపారు. ఎన్నికల సిబ్బంది శిక్షణ కార్యక్రమాల్లో చెప్పిన నిబంధనలు పాటిస్తూ తమ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు.

News December 16, 2025

MBNR: సౌత్ జోన్.. ఈనెల 20న షటిల్, బ్యాడ్మింటన్ ఎంపికలు

image

మహబూబ్ నగర్ లోని పాలమూరు వర్సిటీ నుంచి సౌత్ జోన్ ఆలిండియా పోటీల్లో పాల్గొనే షటిల్, బ్యాడ్మింటన్(పురుషుల) జట్ల ఎంపికలను ఈ నెల 20న నిర్వహించనున్నట్లు పీడీ డా. వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. వయస్సు 17-25 ఏళ్లలోపు ఉండాలని, క్రీడాకారులు బోనఫైడ్, టెన్త్ మెమో, ప్రిన్సిపల్ సంతకంతో కూడిన ఎలిజిబిలిటీ ఫామ్ తీసుకురావాలన్నారు. ఎంపికలు యూనివర్సిటీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉంటాయన్నారు.