News April 6, 2025
పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా

పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా అంతర్గం 39.8℃ నమోదు కాగా రామగుండం 38.8, మంథని 39.7, సుల్తానాబాద్ 39.6, పెద్దపల్లి 39.5, కాల్వ శ్రీరాంపూర్ 39.4, పాలకుర్తి 39.4, రామగిరి 39.3, ఓదెల 39.3, కమాన్పూర్ 39.2, జూలపల్లి 39.1, ముత్తారం 38.9, ఎలిగేడు 38.5, ధర్మారం 38.4℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే జిల్లాలో ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతుంది.
Similar News
News April 7, 2025
తల్లాడ: కాల్వలో గల్లంతైన మృతదేహం లభ్యం

ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో పడిన వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమయింది. ఎస్ఐ కొండలరావు తెలిపిన వివరాలు ప్రకారం.. తల్లాడ మండలం అన్నారుగూడెంకి చెందిన కటుకూరి జయరాజు(58) సాగర్ కెనాల్ గొడ్ల బ్రిడ్జి వద్ద కాళ్లు, చేతులు కడుక్కునేందుకు నీటిలో దిగాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడి కొట్టుకుపోయాడు. ఆదివారం గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకి తీసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
News April 7, 2025
పీయూష్ వ్యాఖ్యలపై స్టార్టప్ ఫౌండర్ ఫైర్

స్టార్టప్ కంపెనీలపై <<15987267>>పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు<<>> కొందరు మద్దతిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. ఓ స్టార్టప్ ఫౌండర్ Xలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘నేను 100మందితో బుర్హాన్‌పూర్(MP)లో సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాను. ఇక్కడ విద్యుత్ సమస్య, లంచాల కోసం అధికారుల వేధింపులు సాధారణం. ఈ సమస్యలపై PMO, IAS అధికారులకు లేఖలు రాసినా స్పందన లేదు. సౌకర్యాలు కల్పించకుండా ఇన్నోవేషన్ కావాలంటే ఎలా?’ అని ఫైర్ అయ్యారు.
News April 7, 2025
వరంగల్: రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం లభ్యం

వరంగల్ శాయంపేట రైల్వే గేట్ సమీపంలో రైలు నుంచి జారి పడి గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైనట్లు వరంగల్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజు తెలిపారు. హంటర్ రోడ్డులోని శాయంపేట గేట్ సమీపాన గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారి పడి మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తుపడితే 9441557232, 8712658585 నంబర్లకు కాల్ చేయాలన్నారు.