News February 27, 2025
పెద్దపల్లి: జిల్లాలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు

పెద్దపల్లి జిల్లాలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజాంబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు 6.73% పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. అందులో పురుషులు 1467, మహిళలు621, మొత్తం 2088 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఇప్పటివరకు 13.68% జరిగింది. అందులో మహిళలు 52, పురుషులు 100 మంది ఓటు వేశారు.
Similar News
News February 27, 2025
కలియుగానికి ఇదో ఉదాహరణ..!

కన్నతల్లికి వృద్ధాప్యంలో చేయూతనిచ్చేందుకు నిరాకరించిన కొడుకుపై హరియాణా హైకోర్టు సీరియస్ అయింది. 77 ఏళ్ల తల్లికి ప్రతినెలా రూ.5000 ఇవ్వాలని దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ వ్యక్తి హైకోర్టుకు వెళ్లారు. దీనిపై జస్టిస్ జస్‌గుర్‌ప్రీత్ సింగ్ తీర్పునిస్తూ.. కలియుగానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. 3 నెలల్లో తల్లి పేరుపై రూ.50వేలు డిపాజిట్ చేసి, ప్రతినెలా రూ.5వేలు చెల్లించాలని ఆదేశించారు.
News February 27, 2025
HYD వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం: సీఎం

HYDలోని మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ నూతన క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. HYD దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని, రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈవీ బయోటెక్ సహా తదితర రంగాల్లో హైదరాబాద్ అగ్రగామిగా ఉందన్నారు.
News February 27, 2025
KGHలో శిశువుల మార్పిడి.. ప్రత్యేక విచారణ కమిటీ

విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH)లో శిశువుల మార్పిడి ఘటన కలకలం రేపింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శివానంద్ దీనిపై స్పందించారు. ఈ మార్పిడి ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఏడుగురు అధికారులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే సీసీ ఫుటేజీ ఆధారంగా అసలు విషయం వెలుగులోకి వస్తుందన్నారు.