News February 27, 2025
పెద్దపల్లి జిల్లాలోని పోలింగ్ అప్డేట్

పెద్దపల్లి జిల్లాలోని పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పట్టభద్రులు మహిళలు 8160, పురుషులు 13098 మొత్తం 21259 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 68.50% పోలింగ్ నమోదయింది. టీచర్స్ ఎమ్మెల్సీలో మహిళలు 438, పురుషులు 611 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 94.42% పోలింగ్ నమోదయింది.
Similar News
News February 28, 2025
చిన్నారిని చిదిమేసిన మానవమృగం.. ప్రైవేట్ పార్ట్స్ వద్ద 29 కుట్లు

ఓ మానవమృగం కామవాంఛకు ఐదేళ్ల చిన్నారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. ఆ బాలిక ప్రైవేట్ పార్ట్స్ వద్ద 29 కుట్లు వేశామని డాక్టర్లు చెప్పడం ఆ 17 ఏళ్ల నిందితుడి రాక్షసత్వానికి నిదర్శనం. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగింది. నిందితుడు పీకలదాకా తాగి బాలిక తలను గోడకు పలుమార్లు కొట్టాడని, శరీరంపై అనేక గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేశామని, జువైనల్‌కు తరలిస్తామని చెప్పారు.
News February 28, 2025
విశాఖ జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ శివరాత్రి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలీసుల సేవలపై ప్రశంసలు
➤ ప్రశాంతంగా ముగిసిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు
➤ జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాలలో 87.30 శాతం పోలింగ్
➤ KGHలో శిశువులు మార్పిడి.. ప్రత్యేక విచారణ కమిటీ
➤ అప్పికొండ బీచ్‌లో విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్‌కు అస్వస్థత
➤ కంచరపాలెంలో తల్లి మందలించిందని 9వ తరగతి విద్యార్థి మృతి
News February 28, 2025
BREAKING: ఆర్సీబీ ఘోర పరాజయం

WPLలో ఆర్సీబీతో జరిగిన మ్యాచులో గుజరాత్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 126 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ గార్డ్‌నర్ (58) ఫిఫ్టీతో రాణించారు. లిచిఫీల్డ్ (30) ఫర్వాలేదనిపించారు. రేణుకా సింగ్, జార్జియా చెరో 2 వికెట్లు తీశారు.