News December 18, 2025

పెద్దపల్లి జిల్లాలో ఉపసర్పంచ్ ఎన్నికలకు ఆదేశాలు

image

గ్రామ పంచాయతీల 2వ సాధారణ ఎన్నికల అనంతరం పెద్దపల్లి జిల్లాలో ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 18న కమాన్‌పూర్, ముత్తారం, ధర్మారం, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లోని గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయి. సంబంధిత ఎంపీడీఓలు, ఎంపీపీలు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని స్పష్టం చేశారు.

Similar News

News December 18, 2025

సకల జాతక దోషాలను నివారించే ఆలయాలివే..

image

కాళహస్తీశ్వర ఆలయం రాహుకేతు పూజలకు ప్రసిద్ధి. కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య గుడిలోనూ సర్ప దోష నివారణ ఆచారాలు పాటిస్తారు. MHలో త్రయంబకేశ్వర్ ఆలయం ఈ దోష నివారణ పూజకు అత్యంత ముఖ్యమైనది. అలాగే మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర ఆలయం(ఉజ్జయిని), ఓంకారేశ్వర్ ఆలయాలు కూడా సకల దోషాలను తగ్గించే శక్తివంతమైన ప్రదేశాలుగా భావిస్తారు. ఈ క్షేత్రాలలో ప్రత్యేక పూజలు చేయడం ద్వారా జాతక దోషాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

News December 18, 2025

నీటి వసతి లేకుంటే పామాయిల్ సాగు వద్దు

image

ఆయిల్ పామ్ సాగును ఎలాంటి నేలల్లో చేపట్టినా నీటి వసతి ముఖ్యం. వర్షాధారంగా ఈ పంట సాగును చేపట్టలేము. అందుకే ఏ రైతైనా ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటే నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పంట సాగు కోసం మొక్కకు రోజుకు 150 నుంచి 250 లీటర్ల నీరు అవసరం అవుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా నీరు అందించి మంచి దిగుబడులను పొందవచ్చు.

News December 18, 2025

514 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

బ్యాంక్ ఆఫ్ ఇండియా(<>BOI<<>>) 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 20 నుంచి JAN 5 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, CA/CFA/CMA-ICWA, MBA/PGDBM/ఫైనాన్స్(PG) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850. SC, ST, PwBDలకు రూ.175. వెబ్‌సైట్: https://bankofindia.bank.in/