News March 30, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రామగుండం 40.1 నమోదు కాగా సుల్తానాబాద్ 40.1, ముత్తారం 39.1, అంతర్గాం 39.9, పాలకుర్తి 39.7, రామగిరి 39.7, పెద్దపల్లి 39.5, ఓదెల 39.3, కాల్వ శ్రీరాంపూర్ 39.0, మంథని 39.0, కమాన్పూర్ 38.5, ఎలిగేడు 38.0, జూలపల్లి 37.1, ధర్మారం 37.6℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే జిల్లాలో ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతుంది.
Similar News
News April 1, 2025
కాకాణి గోవర్ధన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

AP: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై SC, ST కేసు నమోదైంది. గిరిజనులను బెదిరించినట్లు నెల్లూరు (D) పొదలకూరులో PSలో కేసు నమోదు చేశారు. అటు మైనింగ్ కేసులో ఇవాళ 11 గంటలకు విచారణకు రావాలని నిన్న పోలీసులు నోటీసులు ఇవ్వగా.. ఆయన గైర్హాజరయ్యారు. ప్రస్తుతం నెల్లూరు, హైదరాబాద్‌లో కాకాణి అందుబాటులో లేరని తెలుస్తోంది. మరోవైపు, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది.
News April 1, 2025
SMలో HCU భూములపై క్యాంపెయిన్

HCU భూములను వేలం వేయొద్దని, ప్రకృతిని కాపాడాలంటూ SMలో నెటిజన్లు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు చేస్తున్న ఈ ప్రచారంలో వేలాది మంది పాల్గొంటున్నారు. SAVE FOREST, SAVE HCU BIODIVERSTY అంటూ SMలో గళమెత్తుతున్నారు. ఈ ఇన్‌స్టా క్యాంపెయిన్‌లో ఇప్పటికే 10వేల మంది తమ మద్దతు తెలియజేశారు. ప్రతిపక్ష పార్టీలు సైతం HCU భూముల వేలంపై వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి?
News April 1, 2025
యువతిని చంపి జీడితోటలో చెట్టుకు వేలాడదీశాడు

సాలూరు మండలం చీపురువలసలో జరిగిన యువతి హత్య కేసును పోలీసులు చేధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మర్రివానివలసకు చెందిన ఐశ్వర్య విశాఖలో పనిచేస్తోంది. ఓ పెళ్లిలో దత్తివలసకు చెందిన వివాహితుడు రాంబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడ్ని గుడ్డిగా ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని అడగ్గా ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. ఈ క్రమంలో రాంబాబు యువతిని చంపి చెట్టుకు చున్నీతో వేలాడదీసి ఆత్మహత్యలా చిత్రీకరించాడు.