News February 6, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు..
పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత తగ్గుముఖం పడుతుంది. గడచిన 24 గంటల్లో అత్యల్పంగా సుల్తానాబాద్ 18.0℃, రామగుండం 18.3, ఓదెల 18.3, కాల్వ శ్రీరాంపూర్ 18.6, మంథని 18.7, అంతర్గం 18.8, పాలకుర్తి 18.9, ఎలిగేడు 19.2, జూలపల్లి 19.2, ధర్మారం 19.7, పెద్దపల్లి 19.7, కమాన్పూర్ 20.4, రామగిరి 21.9, ముత్తారం 22.1℃గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News February 6, 2025
జమిలి ఎన్నికలపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
AP: రాష్ట్రంలో దారుణమైన పాలన కొనసాగుతోందని YS జగన్ దుయ్యబట్టారు. ‘జమిలి ఎన్నికలు వస్తాయంటున్నారు. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా చంద్రబాబును పంపాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. బాబును చొక్కా పట్టుకొని ప్రశ్నించే రోజులు, తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. బాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని పదేపదే చెప్పా. చంద్రముఖిని మళ్లీ నిద్రలేపి రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
News February 6, 2025
కామారెడ్డి: రేపు బీజేపీ జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం
కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన నీలం చిన్న రాజు ప్రమాణ స్వీకారం శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నామని బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ గుప్తా చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరుణతార, మాజీ ఎంపీ బీబీ పాటిల్, పార్టీ సీనియర్ నాయకులు హాజరవుతారని ఆయన చెప్పారు.
News February 6, 2025
2027లో చంద్రయాన్-4 లాంచ్
చంద్రుడిపై రాతి నమూనాలను తీసుకొచ్చే చంద్రయాన్-4ను భారత్ 2027లో లాంచ్ చేస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఈ మిషన్లో LVM-3 రాకెట్‌ను 2సార్లు అంతరిక్షంలోకి పంపిస్తారని తెలిపారు. అవి తీసుకెళ్లే వేర్వేరు పరికరాలను చంద్రుడి కక్ష్యలోనే అసెంబుల్ చేస్తారని వివరించారు. ఆస్ట్రోనాట్‌ను రోదసిలోకి పంపే గగన్‌యాన్, సముద్ర గర్భంలో 6000KM లోతుకు వెళ్లే సముద్రయాన్‌ను 2026లో లాంచ్ చేస్తామన్నారు.