News March 23, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. వాతావరణ ప్రభావంతో కొన్ని మండలాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మంథని 37.5℃ నమోదు కాగా రామగిరి 37.4, ముత్తారం 37.8, పాలకుర్తి 36.8, కమాన్పూర్ 36.7, ఓదెల 36.6, సుల్తానాబాద్ 36.2, కాల్వ శ్రీరాంపూర్ 36.1, రామగుండం 35.8, అంతర్గం 35.6, పెద్దపల్లి 34.8, ధర్మారం 34.6, ఎలిగేడు 34.4, జూలపల్లి 33.2℃ గా నమోదయ్యాయి.
Similar News
News March 24, 2025
తాగునీటి సమస్య పై టోల్ ఫ్రీ : జిల్లా కలెక్టర్

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంటే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన తాగునీటి మానిటరింగ్ సెల్‌కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. తాగు నీటి సమస్యల కోసం 9908712421 నంబర్‌కు కాల్ చేయవచ్చని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పని చేస్తుందని పేర్కొన్నారు. ఫిర్యాదులను సంబంధిత పంచాయతీ, మిషన్ భగీరథ అధికారులకు తెలుపాలన్నారు.
News March 24, 2025
ఢిల్లీకి షాక్.. 7కే 3 వికెట్లు

IPL: వైజాగ్ వేదికగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కష్టాల్లో పడింది. 1.4 ఓవర్లలో 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఫ్రేజర్ 1, పోరెల్ 0, రిజ్వీ 4 పరుగులకు ఔటయ్యారు. శార్దూల్ 2, సిద్ధార్థ్ ఒక వికెట్ తీశారు. క్రీజులో అక్షర్, డుప్లెసిస్ ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 209 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
News March 24, 2025
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

TG: రాష్ట్రంలో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.