News December 14, 2025
పెద్దపల్లి జిల్లాలో ఎంతమంది ఓటు వేశారంటే@9AM?

పెద్దపల్లి జిల్లాలో గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికలు శాంతియుతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 1,12,658 మంది ఓటర్లలో 26,965 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్ శాతం 23.94%గా నమోదైంది. అంతర్గాం మండలంలో 24.98 శాతం, ధర్మారం 26.66 శాతం, జూలపల్లి 23.90 శాతం, పాలకుర్తి 19.18 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News December 15, 2025
జనవరిలో భారీ ఓపెనింగ్స్.. ప్రిపేర్ అవ్వండి!

డిసెంబర్ ‘డ్రై మంత్’ ముగియగానే జనవరిలో ఐటీ కంపెనీలు భారీ నియామకాలు చేపట్టడానికి సిద్ధమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇయర్ ఎండ్ ఆడిట్‌లు, బడ్జెట్ ప్రణాళికలు పూర్తవడంతో డిసెంబర్‌లో ఇంటర్వ్యూలు ఆగిపోతాయి. జనవరి ఓపెనింగ్స్ కోసం HR టీమ్స్ ప్లాన్ చేసుకుంటాయి. రాబోయే నోటిఫికేషన్‌లు, లక్ష్యంగా చేసుకోవాల్సిన కంపెనీలపై ప్రణాళిక వేసుకొని సిద్ధంగా ఉండాలి’ అని నిపుణులు సలహా ఇస్తున్నారు. SHARE IT
News December 15, 2025
ATP: మృత్యువులోనూ వీడని మూడుముళ్ల బంధం

రాయదుర్గం మండలం పల్లేపల్లిలో తిప్పన్న (72), తిప్పమ్మ (68) దంపతులు ఒకేరోజు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఇటీవల తిప్పమ్మ అనారోగ్యంతో మంచాన పడింది. ఆ దిగులుతో తిప్పన్న సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. భర్త మరణం తట్టుకోలేక ఉదయమే ఆమె కూడా కన్ను మూసింది. ఒకే రోజు భార్యాభర్త మృతి చెందడంతో ‘మృత్యువులోనూ వీడని మూడుముళ్ల బంధం’ అని గ్రామస్థులు పేర్కొన్నారు.
News December 15, 2025
సంగారెడ్డి: గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలు

గంజాయి కేసులో నలుగురు నిందితులకు పదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారని ఎక్సైజ్ సూపరింటెండెంట్ హరికిషన్ తెలిపారు. 2019లో గంజాయిని తరలిస్తూ నిఖిల్, శ్రీనివాస్, సంతోష్, శ్రీకాంత్ అరెస్టు అయ్యారు. నేరం రుజువు కావడంతో జడ్జి వారికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.


