News December 14, 2025

పెద్దపల్లి జిల్లాలో ఎంతమంది ఓటేశారంటే @11AM

image

పెద్దపల్లి జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 62,187 మంది ఓటు వేయగా 55.20 శాతం పోలింగ్ నమోదైంది. అంతర్గం మండలంలో 10,536 ఓట్లు 58.76 శాతం, ధర్మారం మండలంలో 21,927ఓట్లు 51.66 శాతం, జూలపల్లి మండలంలో 14206 ఓట్లు 58.79 శాతం, పాలకుర్తి మండలంలో 15,518 ఓట్లు 55.19శాతం పోలింగ్ నమోదు అయింది.

Similar News

News April 16, 2026

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ‘దోస్త్’ సందడి

image

డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ (DOST) ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని ప్రముఖ విద్యాసంస్థలైన నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ​అనుభవజ్ఞులైన అధ్యాపకులు, మెరుగైన వసతులు ఉండటంతో ఈ కళాశాలలకు డిమాండ్ పెరిగింది. మే 7 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లకు గడువు ఉంది.
#SHAREIT

News April 16, 2026

HYD: మత్తుకు బానిసయ్యారా? ఇక్కడికి తీసుకురండి

image

మత్తుకు బానిసైన వారికి విముక్తి కల్పించడం కోసం ప్రభుత్వం డీ అడిక్షన్ సెంటర్లను ప్రారంభించింది. HYD గాంధీ ఆసుపత్రిలోనూ సెంటర్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సేవలు ప్రారంభమయ్యాయి. మద్యం, గంజాయి, సిగరెట్ ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారటంతో వ్యక్తిగత జీవితంతో పాటు, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాటి నుంచి విముక్తి కల్పించడం కోసం చర్యలు చేపట్టారు.

News April 16, 2026

WGL: తెర మీదకు పాత నియోజకవర్గ పేర్లు!

image

అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లు నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 నుంచి 18 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది.దీంతో పెరిగే నియోజకవర్గాలు ఏంటనే చర్చ మొదలైంది. కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలు, గతంలో కనుమరుగైన నియోజకవర్గాలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. శాయంపేట, ధర్మసాగర్, గుడూరు, చేర్యాల, హసన్‌పర్తితో పాటుగా కొత్తగా నెక్కొండ, కాజీపేట నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలంటున్నారు.