News October 19, 2025

పెద్దపల్లి జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన

image

పెద్దపల్లి జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన కనిపించింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు కేంద్రాల వద్ద శనివారం ఒక్కరోజులోనే 597 దరఖాస్తులు వచ్చినట్టు జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు పెద్దపల్లిలో 325, సుల్తానాబాద్ 249, రామగుండం 373, మంథని 242 మొత్తంగా 1189 దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు.

Similar News

News October 19, 2025

రేపు ప్రకాశం జిల్లా SP కార్యక్రమం రద్దు

image

దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీన (ప్రభుత్వ సెలవు దినం) పండుగ కారణంగా “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం” తాత్కాలికంగా రద్దు చేయడమైనదని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు చేసేందుకు వ్యయ ప్రయాసలుపడి జిల్లా పోలీసు కార్యాలయంకు సోమవారం రావద్దని ఎస్పీ సూచించారు.

News October 19, 2025

APPLY NOW: BELలో 176 ఉద్యోగాలు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)176 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ -సి పోస్టులు ఉన్నాయి. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిప్లొమా(ఇంజినీరింగ్), టెన్త్+ ITI అర్హతగల అభ్యర్థులు నవంబర్ 4 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 19, 2025

బాపట్లలో రేపు పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

image

బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటించారు. ఈనెల 20న దీపావళి సందర్భంగా ప్రభుత్వం సెలవు దినం ప్రకటించినందున సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జీలు ఇవ్వడానికి ప్రజలు రావద్దని సూచించారు.