News December 17, 2025
పెద్దపల్లి జిల్లాలో ఓటింగ్ నమోదు ఎంతంటే..?

పెద్దపల్లి జిల్లాలోనీ గ్రామ పంచాయతీలలో ఉదయం ప్రారంభమైన పోలింగ్ ఒంటి గంటకు పూర్తయింది. పెద్దపల్లి మండలంలో 80.5%, సుల్తానాబాద్ మండలంలో 84.51%, ఎలిగేడు మండలంలో 83.02%, ఓదెల మండలంలో 82.85% నమోదు కాగా, మొత్తం పెద్దపల్లి జిల్లాలో 82.34% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు.
Similar News
News December 17, 2025
భద్రాద్రి: అన్నపై సర్పంచిగా గెలిచిన తమ్ముడు

జూలూరుపాడు మండలం కొత్తూరు పంచాయతీ ఎన్నికలు రాజకీయంగానే కాకుండా, కుటుంబపరంగానూ ఆసక్తి రేకెత్తించాయి. ఇక్కడ సర్పంచ్ పదవి కోసం సాక్షాత్తూ అన్నదమ్ములైన అక్కుల రాములు(CPI), అక్కుల నరసింహారావు(కాంగ్రెస్) ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో అన్న రాములుపై తమ్ముడు నరసింహారావు 26 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. రక్త సంబంధీకుల మధ్య హోరాహోరీ పోరు సాగడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
News December 17, 2025
లక్ష్యాల సాధనకు పక్కా ప్రణాళికలు రూపొందించాలి: సీఎం

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ప్రారంభమైన ఐదో జిల్లా కలెక్టర్ల సదస్సులో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో జిల్లా పురోగతిని సీఎం సమీక్షించారు. GSDP వృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి జిల్లా స్థాయిలో పక్కా ప్రణాళికలతో ముందుకు సాగాలని కలెక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు.
News December 17, 2025
సర్పంచ్ ఎన్నికలు: జగన్‌పై చంద్రబాబు విజయం

TG: భద్రాద్రి జిల్లా గుండ్లరేవులో జగన్, చంద్రబాబు అనే వ్యక్తులు సర్పంచ్ బరిలో నిలవడంతో చాలా మందికి ఫలితంపై ఆసక్తి ఏర్పడింది. ఇవాళ్టి మూడో విడతలో బానోతు జగన్(Right)పై భూక్యా చంద్రబాబు (Left) విజయం సాధించారు. రాజకీయాల్లోని ప్రముఖ నాయకుల పేర్లతో ఉన్న అభ్యర్థులు ఇక్కడ తలపడటంతో ఈ పోరు మొదటి నుంచీ అత్యంత ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలోని 2 వేర్వేరు వర్గాల మద్దతుతో వీరు బరిలో నిలిచారు.


