News February 13, 2026
పెద్దపల్లి జిల్లాలో పార్టీల వారీగా విజేతల వివరాలు..!

పెద్దపల్లి జిల్లాలో 124 వార్డు స్థానాలు ఉండగా రామగుండం కార్పొరేషన్ లో ఒక డివిజన్ ఏకగ్రీవమైంది. మిగతా 123 వార్డులకు జరిగిన ఎన్నికలలో పార్టీల వారీగా బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ – 89, BRS – 16, BJP- 3, AIFB- 13, CPI- 1, స్వతంత్ర అభ్యర్థులు- 2 స్థానాలలో విజయం సాధించారు.
Similar News
News February 14, 2026
ఫిబ్రవరి 14: చరిత్రలో ఈరోజు

1898: స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత దిగవల్లి వేంకటశివరావు జననం
1921: ఆంధ్రప్రదేశ్ రెండో సీఎం దామోదరం సంజీవయ్య జననం
1952: మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ జననం
1983: తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు మరణం(ఫొటోలో)
1984: నటుడు సి.హెచ్. నారాయణరావు మరణం
2019: పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్ల వీరమరణం
☛ ప్రేమికుల దినోత్సవం
News February 14, 2026
MNCL: ఖంగుతిన్న భార్యాభర్తలు.. రెండు చోట్ల ఓటమి

మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండు చోట్ల పోటీ చేసిన భార్యాభర్తలు ఊహించని విధంగా ఓటమిపాలయ్యారు. బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు గాదె సత్తయ్య (20 డివిజన్), ఆయన భార్య గాదే రమాదేవి (43వ డివిజన్)లో పోటీ చేసి పరాజయం చెందారు. రెండుసార్లు కౌన్సిలర్లుగా సేవలు అందించిన వీరికి కార్పొరేషన్‌లో ఓటమి తప్పలేదు.
News February 14, 2026
BHPL: గవర్నమెంట్ జాబ్‌కు రాజీనామా.. చివరికి ఓటమి!

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా హరీష్ పోటీ చేసి ఓటమి చెందారు. హరీష్ పంచాయతీ శాఖలో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కాంట్రాక్టు ఉద్యోగంలో పనిచేసేవాడు. మూడున్నర సంవత్సరాల పాటు ఉద్యోగంలో పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి కౌన్సిలర్‌గా పోటీ చేశాడు. దీంతో హరీష్‌కు కేవలం 81 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉద్యోగాన్ని వదిలి సేవ చేసేందుకు వచ్చినా వార్డు ప్రజలు ఆదరించలేదు.


