News December 16, 2025
పెద్దపల్లి జిల్లాలో పూర్తిస్థాయిలో ఎన్నికల ఏర్పాట్లు

PDPL జిల్లా గ్రామ పంచాయతీ 3వ దశ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో మొత్తం 91 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలిగేడు, ఓదెల, PDPL, సుల్తానాబాద్ మండలాల్లో 128 పోలింగ్ అధికారులు, 166 అసిస్టెంట్ పోలింగ్ అధికారులను రిజర్వ్‌తో సహా నియమించారు. వీరికి DEC 12న శిక్షణ పూర్తయింది. 1,44,563 ఓట్లకు గాను 1,37,335 ఓటర్ల స్లిప్‌లు పంపిణీ కాగా, 7,228 స్లిప్‌లు ఇంకా మిగిలి ఉన్నాయి.
Similar News
News December 16, 2025
హైదరాబాద్‌కు IIM మంజూరు చేయండి: CM

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ (YIIRS) ఏర్పాటుకు సహకరించాలని TG సీఎం రేవంత్ ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలను కోరారు. 105 YIIRSలు నిర్మిస్తున్నామని, వీటితో 4 లక్షల మందికి మెరుగైన విద్య అందుతుందని తెలిపారు. ఇందుకు రూ.30వేల కోట్ల ఖర్చు అవుతుందని, ఈ మొత్తానికి తీసుకునే రుణాలను FRBM నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. అటు హైదరాబాద్‌కు IIM మంజూరు చేయాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు.
News December 16, 2025
ADB: మావోయిస్టు నేత దామోదర్ అరెస్ట్

మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ పోలీసులకు చిక్కారు. ఆదిలాబాద్ నుంచి సేఫ్ జోన్‌కు వెళ్తుండగా పోలీసులకు చిక్కినట్లు సమాచారం. పట్టుబడ్డ బడే చొక్కారావుతో పాటు 15 మంది మావోయిస్టులు సిర్పూర్(యూ)లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉండగా, మావోయిస్టులను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలించారు.
News December 16, 2025
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: సిద్దిపేట సీపీ

ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై కేసులు నమోదుకానున్నాయని CP విజయ్‌కుమార్ ప్రకటించారు. విజయోత్సవాల్లో పటాకులు కాల్చడం, అనుమతి లేని ర్యాలీలు నిర్వహించడం, ప్రభుత్వ అధికారుల పనికి ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొదటి దశ ఎన్నికల్లో 20 కేసులు, రెండవ దశలో 13 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.


