News March 17, 2025
పెద్దపల్లి జిల్లాలో భగ్గుమంటున్న భానుడు

వేసవి నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమవారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 40.9℃గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి తీవ్రత కూడా తగ్గడంతో ఓదెల మండలంలో 18.0℃ సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఇప్పటికే జిల్లా ప్రజలు ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో వేడి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది.
Similar News
News March 17, 2025
చర్లపల్లి టర్మినల్‌కు పొట్టిశ్రీరాములు పేరు పెట్టండి: రేవంత్

TG: చర్లపల్లి టర్మినల్‌కు పొట్టిశ్రీరాములు పేరు పెట్టాలని CM రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డికి లేఖ రాస్తామని చెప్పారు. టర్మినల్‌కు ఆయన పేరు పెట్టి దేశభక్తి చాటుకోవాలని కోరారు. బల్కంపేటలోని ప్రకృతి వైద్య చికిత్స ఆలయానికి రోశయ్య పేరు పెడతామన్నారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
News March 17, 2025
HYD: KTRతో తీన్మార్ మల్లన్న భేటీ.. మీ కామెంట్?

హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం జరిగింది. తీన్మార్ మల్లన్న సోమవారం KTR, హరీశ్ రావుతో భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని BRS నేతలను కోరారు. అయితే, వీరి భేటీపై సోషల్ మీడియాలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. గతంలో BRSపై తీవ్ర విమర్శలు చేసిన తీన్మార్ మల్లన్న.. KTRను కలవడం చర్చనీయాంశమైంది. దీనిపై మీ కామెంట్?
News March 17, 2025
కైలాసగిరిపై దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి

కైలాసగిరిపై ఏప్రిల్ నాటికి దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి అందుబాటులోకి తీసుకొస్తామని వీఎంఆర్డీఏ చైర్ పర్సన్ ప్రణవ్ గోపాల్, ఎంసీ విశ్వనాథన్ తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. బీచ్ రోడ్డులో హెలికాప్టర్ మ్యూజియం, సిరిపురంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, కమర్షియల్ కాంప్లెక్స్‌లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. అనకాపల్లి వద్ద హెల్త్ సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.