News February 9, 2025

పెద్దపల్లి జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి

image

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుండటంతో గ్రామాల్లో ఆశావహులు తమదైన రీతిలో ప్రచారం మొదలు పెట్టారు. పలు చోట్ల మాజీ సర్పంచులతో పాటు.. యువకులు, ఇతరులు ఎన్నికల్లో నెగ్గేందుకు మంతనాలు ప్రారంభించారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని పలువురు ప్రధాన నేతలను కలుస్తున్నారు.

Similar News

News April 9, 2026

మెదక్: దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

image

హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్స్ టెక్నాలజీ డిప్లొమా కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. HYDలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఈ కోర్సు నిర్వహించబడుతుందన్నారు. 10వ తరగతి అర్హతతో 2026-27 విద్యా సంవత్సరానికి మొదటి ఏడాది డిప్లొమాలో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News April 9, 2026

కుప్పం మండలానికి రూ.1.5 కోట్ల నజరానా: DPO

image

జాతీయస్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో నానాజీ దేశ ముఖ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ (NDSPSVP)లో కుప్పం మండలం తృతీయ స్థానం సాధించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానా రూ.1.50 కోట్లు జమ చేసినట్లు డీపీవో సుధాకర్ రావు బుధవారం తెలిపారు. కుప్పం మండలంలోని నాయనూరు పంచాయతీలో పర్యటించిన కేంద్ర బృందం వసతులు బాగుండడంతో మండలాన్ని జాతీయ అవార్డుకు ఎంపిక చేసిందని ఆయన చెప్పారు.

News April 9, 2026

తూ.గో: పెళ్లి పేరుతో వంచన.. యువతిని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

image

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని శారీరకంగా లొంగదీసుకుని ఆపై మోసం చేసిన రాజమండ్రికి చెందిన దవులూరి వినోద్ కుమార్‌ను అమలాపురం పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. జడ్జి అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు పట్టణ సీఐ వీరబాబు తెలిపారు.