News December 11, 2025

పెద్దపల్లి జిల్లాలో మొదటి విడత ఎన్నికల వివరాలు

image

PDPL జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు కమాన్‌పూర్, మంథని, ముత్తారం, రామగిరి, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సర్పంచ్ స్థానాలు: 99
ఏకగ్రీవమైన పంచాయతీలు: 4
అభ్యర్థులు: 377 మంది
వార్డు స్థానాలు: 896
ఏకగ్రీవమైన వార్డులు: 211
అభ్యర్థులు: 1880 మంది
పోలింగ్ కేంద్రాలు: 896
ఓట్ల లెక్కింపు: 2 గం. నుంచి
పీవోలు (పోలింగ్ అధికారులు): 1031 మంది
ఉప పీవోలు: 1,346 మంది.

Similar News

News December 12, 2025

ఒకే జిల్లాలో 7,400 HIV కేసులు

image

బిహార్‌లోని సీతామఢీ జిల్లాలో ఏకంగా 7,400 HIV కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో 400 మంది చిన్నారులున్నారు. వీరికి తల్లిదండ్రుల ద్వారా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ జిల్లాలో ప్రతి నెలా 40-60 దాకా కేసులు నమోదవుతున్నాయని, ప్రస్తుతం 5వేల మందికి పైగా వైద్యం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సరైన అవగాహన, టెస్టింగ్ లేకపోతే వ్యాధి మరింత వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News December 12, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 మండలాల్లోని 85 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 79.57 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.

News December 12, 2025

కరీంనగర్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

కరీంనగర్ జిల్లాలో 5 మండలాల్లోని 92 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 81.82 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.