News February 15, 2025
పెద్దపల్లి: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా: DAO

పెద్దపల్లి జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి పేర్కొన్నారు. యాసంగి సీజన్లో సాగువిస్తీర్ణం, రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 37వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా ప్రకారం దిగుమతికి చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు, DCMS, రైతు ఉత్పత్తి దారుల సంస్థలు ద్వారా రైతులకు ఆయా మండలాల వారీగా సరఫరా చేస్తామన్నారు.
Similar News
News November 9, 2025
రాష్ట్రస్థాయి పోటీలో ఫైనల్‌కు ADB జట్టు

నారాయణపేటలో జరుగుతున్న ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ అండర్-17 బాలికల విభాగంలో ఆదిలాబాద్ జిల్లా జట్టు ఫైనల్‌కు చేరింది. సెమి ఫైనల్ మ్యాచ్‌లో కరీంనగర్ జట్టుపై ఆదిలాబాద్ జట్టు విజయం సాధించింది. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌లలో జిల్లా జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. ఘన విజయాలను నమోదు చేసినట్లు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ రామేశ్వర్ తెలిపారు. జిల్లా జట్టుకు DEO రాజేశ్వర్ అభినందనలు తెలిపారు.
News November 9, 2025
వికారాబాద్ బీజేపీ అధ్యక్ష పదవి జాప్యంపై ఉత్కంఠ

డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడంపై పార్టీలో చర్చ నడుస్తోంది. ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినా, అధిష్ఠానం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ జాప్యానికి కారణం ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మద్దతు ఎవరికి ఉంటుందనే అంశంపై జిల్లా రాజకీయాల్లో భారీగా ఉత్కంఠ నెలకొంది.
News November 9, 2025
అన్నమయ్య: నూతన కమిటీ నియామకం

అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా నూతన కమిటీని ఎంపిక చేశారు. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్.శ్రీలక్ష్మి, పి.రాజేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా యం.గౌరి నియమితులయ్యారు. ఆ సంఘం 2వ జిల్లా మహాసభ మదనపల్లె ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగింది. 13 మంది ఆఫీస్ బేరర్లు, 33మందితో జిల్లా కమిటీ ఏర్పరిచారు.


