News August 19, 2024
పెద్దపల్లి జిల్లాలో విషాదం.. అల్లుడిని చంపిన మామ

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. గ్రామానికి చెందిన కనకయ్య తన అల్లుడైన అశోక్ తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 5, 2026
KNR: మెజారిటీకి అడ్డంకిగా ‘త్రిముఖ’ పోరు!

కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు స్వతంత్రులు, రెబల్స్ సవాల్‌గా మారారు. 66 డివిజన్లలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. మరోవైపు ఎంఐఎం 15 చోట్ల, జనసేన, బీఎస్పీలు గణనీయమైన స్థానాల్లో పోటీ చేస్తూ తృతీయ ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. అభ్యర్థుల సంఖ్య పెరగడంతో ఓట్లు భారీగా చీలిపోయి, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
News February 5, 2026
నేడు కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి నేడు కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు గుమ్లాపూర్ చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4:50 వరకు అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News February 4, 2026
రేపు కరీంనగర్ జిల్లాకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి రేపు చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలం ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణాలను పరిశీలించి, భద్రతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భారీ పోలీస్ బందోబస్తుతో పాటు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ స్థలాలను కేటాయించారు.


