News February 12, 2025
పెద్దపల్లి జిల్లాలో 140 ఎంపీటీసీ, 13 జడ్పీటీసీ స్థానాలు

పెద్దపల్లి జిల్లాలో MPTC, ZPTC ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 140 ఎంపీటీసీలు, 13 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. పెద్దపల్లిలో అత్యధికంగా 50,994 మంది, ఎలిగేడులోని అత్యల్పంగా 18,537 మంది ఓటర్లు ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో పురుషులు 2,03,366, మహిళలు 2,09,927, ఇతరులు 13 మంది, మొత్తం 4,13,306 మంది ఓటర్లు నమోదయ్యారు. మొత్తం 755 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
Similar News
News July 7, 2025
ముప్పాళ్ల: ట్రాక్టర్‌పై నుంచి పడి చిన్నారి మృతి

ముప్పాళ్ల (M) నార్నేపాడుకి చెందిన కొండారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి కుటుంబంలోని చిన్నారి దీక్ష ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి కింద పడి కన్ను మూసింది. తొలి ఏకాదశి పండుగ నాడు పొలానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. నరసరావుపేటలోని పాఠశాలలో దీక్ష చదువుతోంది. గ్రామంలో గాయపడిన దీక్షను చికిత్స కోసం నరసరావుపేటకు తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో మరణించింది. పాప మృతితో కటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News July 7, 2025
అన్నమయ్య: భార్య కాపురానికి రాలేదని సూసైడ్

అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గాలివీడు(M) మల్లసానివాళ్లపల్లెకు చెందిన తుపాకుల గోపాల్(37)కు పెద్దమండ్యానికి చెందిన రమణమ్మతో పదేళ్ల కిందట పెళ్లి జరగ్గా నలుగురు పిల్లలు ఉన్నారు. గోపాల్ మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో రమణమ్మ పుట్టింటికి వెళ్లింది. ఆమె కాపురానికి రావడం లేదని, తాను చనిపోతానని తల్లిదండ్రులకు గోపాల్ చెప్పాడు. తన ఇంట్లోనే ఉరేసుకున్నాడు.
News July 7, 2025
ఆదిలాబాద్: కంట్లో కారం చల్లి, బండరాళ్లతో కొట్టి హత్య

లక్ష్మిపూర్ అటవీ ప్రాంతంలో <<16964169>>మహిళ <<>>మృతదేహం ఆదివారం లభ్యమైన విషయం తెలిసిందే. ఇంద్రవెల్లి(M) నర్సాపూర్ వాసి వందన(45), ADB వాసి శంకర్‌ను పెళ్లిచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఎలాగైనా చంపాలని భావించి ఈనెల 2న లక్ష్మిపూర్ అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. కంట్లో కారం చల్లి, తలపై బండరాళ్లతో కొట్టి హత్యచేశాడు. తండ్రిపై అనుమానంతో కూతురు PSలో ఫిర్యాదు చేయగా హత్య చేసినట్లు శంకర్ అంగీకరించాడు.