News December 12, 2025

పెద్దపల్లి జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

పెద్దపల్లి(D)లో 5 మండలాల్లోని 99 పంచాయతీల్లో గురువారం మొదటివిడత ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 82.24 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు. కాల్వశ్రీరాంపూర్ 83.06, ముత్తారం 82.75, రామగిరి 77.96, కమాన్‌పూర్ 83.59, మంథనిలో 84.39 పోలింగ్ నమోదైంది.

Similar News

News March 4, 2026

TODAY HEADLINES

image

☛ చంద్రబాబు-పవన్ భేటీ.. జల్ జీవన్ మిషన్, హనుమాన్ ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చ
☛ ఫేస్ రికగ్నిషన్‌తోనే ఇకపై పథకాలు: CM రేవంత్
☛ చంద్రగ్రహణం.. ఎర్రని రంగులో కనువిందు చేసిన చంద్రుడు
☛ కేంద్ర మాజీ మంత్రి ఉన్నికృష్ణన్ కన్నుమూత
☛ ఇరాన్ అణు కేంద్రం ధ్వంసం: IAEA
☛ యుద్ధ ప్రభావం.. ఇరాన్‌లో 787 మంది మృతి

News March 4, 2026

పాక్‌ను సామంత రాజ్యంగా మార్చే కుట్ర: ఖవాజా ఆసిఫ్

image

ఇరాన్‌పై జరుగుతున్న దాడుల వెనుక జియోనిజం(ఇజ్రాయెల్ జాతీయవాదం) ప్లాన్ ఉందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ విమర్శించారు. తమ దేశ సరిహద్దుల వరకు ఇజ్రాయెల్ ప్రాబల్యాన్ని విస్తరించాలని ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. పాక్‌ను సామంత రాజ్యంగా మార్చే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఇందులో అఫ్గాన్, ఇండియాకు భాగముందన్నారు. తమ అణుశక్తిని ప్రపంచం గుర్తించిందని, దేశాన్ని కాపాడేందుకు సైన్యం రెడీగా ఉందని చెప్పారు.

News March 4, 2026

4 నెలల బాబుకు ప్రాణం పోశారు!

image

TG: ఆరోగ్య సమస్యలు, తక్కువ బరువు(2.8kgs)తో కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన 4నెలల బాబు ప్రాణాలను డాక్టర్లు కాపాడారు. కాలిన గాయాలు, రక్తహీనత, శ్వాస సమస్యలతో బాధపడుతున్న మడకం శివ అనే చిన్నారిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. 36 రోజుల చికిత్స తర్వాత బాలుడి బరువు 4.25kgsకి పెరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. చిన్నారికి మెరుగైన చికిత్స అందించిన డాక్టర్లపై ప్రశంసలొస్తున్నాయి.