News February 19, 2025
పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌తో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రభుత్వ కార్యక్రమాలపై మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్లు జే.అరుణశ్రీ, డి.వేణులతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని శాంతి కుమారి ఆదేశించారు.
Similar News
News September 15, 2025
అక్టోబర్ 4న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం: కలెక్టర్

జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం అక్టోబర్ 4న ఉదయం 10:30కు జరుగుతుందని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. MHBD పట్టణం కొత్త బజార్‌లోని లయన్స్ భవన్‌లో సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లాకు సంబంధించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గం హాజరై ఎజెండాలోని పలు అంశాలపై చర్చించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News September 15, 2025
స్కూల్ గేమ్స్ రైఫిల్ షూటింగ్, ఆర్చరీ జట్ల ఎంపిక

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్-14, అండర్-17 రైఫిల్ షూటింగ్, ఆర్చరీ జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు సునీత, పీఎస్ఎన్ మల్లేశ్వరరావు సోమవారం తెలిపారు. 16న చింతలపాటి బాపిరాజు మున్సిపల్ హై స్కూల్ భీమవరం వద్ద రైఫిల్ షూటింగ్ ఎంపిక ఉంటుందన్నారు. 17న వోల్గాస్ అకాడమీలో ఆర్చరీ జట్లు ఎంపిక ఉంటుందన్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అర్హులన్నారు.
News September 15, 2025
పెద్ద గంట్యాడలో ఉచిత శిక్షణ

ఏపీ ప్రభుత్వం స్థాపించిన నేక్ ఆధ్వర్యంలో బ్రాడ్ బాండ్ టెక్నీషియన్ కోర్స్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ సోమవారం తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసి 18-40 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువత అర్హులన్నారు. 3 నెలల శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టార్లో ఉపాధి కల్పిస్తారన్నారు. పెద్ద గంట్యాడ నేక్ సెంటర్లో శిక్షణ అందిస్తామని తెలిపారు.