News October 17, 2025
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల రాస్తారోకో

ఓ దినపత్రికపై కక్షగట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న దాడులను నిరసిస్తూ పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ రహదారిపై అమరవీరుల స్తూపం వద్ద శుక్రవారం జర్నలిస్టులు రాస్తారోకో చేశారు. పత్రికా స్వేచ్ఛపై దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని అన్ని వర్గాలవారు ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. వివిధ పత్రికలు, టీవీ ఛానెళ్ల జర్నలిస్టులు పాల్గొన్నారు.
Similar News
News October 17, 2025
కామారెడ్డి: విద్యుత్ షాక్ తగిలి యువకుడి మృతి

నాగిరెడ్డి పేటలో శుక్రవారం విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు(D) రామసముద్రం గ్రామానికి చెందిన సయ్యద్ చోటు బాతులను మేపుకుంటూ వెళ్తుండగా కొన్ని బాతులు పొలంలోకి వెళ్లాయి. వాటిని తీసుకురావడానికి వెళ్లగా పొలంలో స్టాటర్ డబ్బా వైర్లు అతని కాలుకు తగిలి షాక్‌కు గురయ్యాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News October 17, 2025
శ్రీనిధి రుణాలు సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు DRDA వెలుగు ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీనిధి రుణాలను సద్వినియోగంచేసుకొని అభివృద్ధి చెందాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీనిధి గోడ పత్రికలను కలెక్టర్‌తో కలిసి పీడీ నరసయ్య ఆవిష్కరించారు. శ్రీనిధి ద్వారా మహిళా సంఘాల మహిళలు తమ జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఇతర ఆర్థికఅవసరాలకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయం పొందవచ్చని కలెక్టర్ తెలిపారు.
News October 17, 2025
నవంబర్ 11న సెలవు

TG: నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఆ రోజున నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ నియోజకవర్గంలో ఓటు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.