News March 15, 2025

పెద్దపల్లి: జిల్లా పంచాయతీ అధికారిని కలిసిన నూతన కార్యవర్గం

image

టీఎన్జీవో అనుబంధ తెలంగాణ పంచాయతీ సెక్రటరీ సెంటర్ ఫోరం పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గం శనివారం పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్యను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని డిపివోను కోరగా సమస్యలు ఉన్నతాధికారులకు సిపారసు చేస్తానని డిపివో హామీ ఇచ్చారు. డిపివోను కలిసిన వారిలో టిఎన్జివో జిల్లా అధ్యక్షులు బొంకురి శంకర్, కార్యదర్శులు ఉన్నారు.

Similar News

News July 4, 2025

GWL: ‘రైతులకు న్యాయం చేసేందుకు సహకరిస్తాం’

image

భారత్ మాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయపరంగా పరిహారం అందించేందుకు సహకరిస్తామని కలెక్టర్ సంతోశ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఛాంబర్‌లో అయిజ మండలం జడదొడ్డి, బింగిదొడ్డి గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పరిహారం పెంచే విధంగా జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ అధికారులతో చర్చిస్తామన్నారు.

News July 4, 2025

గద్వాల: ‘ఆపరేషన్ ముస్కాన్-11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’

image

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-11 కార్యక్రమాన్ని సంబంధిత శాఖ అధికారులు విజయవంతం చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం గద్వాలలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారిని రక్షించి, పునరావాసం కల్పించి సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.

News July 4, 2025

RJPT: భూ భారతి దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్

image

రాజంపేట మండలం తలమడ్లలో శుక్రవారం కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ భూ భారతి దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పర్యటించారు. దేవాయిపల్లిలో జరుగుతున్న దరఖాస్తుల పరిశీలించారు. సమీక్షించిన కలెక్టర్, భూ భారతి చట్టానికి అనుగుణంగా ప్రతి దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్‌ జానకికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీణ, డిప్యూటీ తహశీల్దార్ సంతోషి, సిబ్బంది పాల్గొన్నారు.