News December 27, 2025
పెద్దపల్లి: ‘జీవో 252ను రద్దు చేయాలి’

జర్నలిస్టుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే జీవో 252ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (హెచ్ 143) ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో కోత విధిస్తే సహించేది లేదని, ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
Similar News
News December 30, 2025
హరీశ్ రావు ఆరోపణలకు ఉత్తమ్ కౌంటర్

TG: బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ <<18714031>>హరీశ్ రావు<<>> చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ ఖండించారు. ‘హరీశ్ రావు అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం పోరాడుతూనే ఉంది. ఇప్పటికే దానిపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. అది జనవరి 5న విచారణకు రానుంది. కేంద్రం ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడమే కాకుండా.. DPR కూడా సిద్ధం చేయకుండా APని అడ్డుకుంది’ అని తెలిపారు.
News December 30, 2025
పుంగనూరు: బైకును ఢీకొన్న RTC బస్సు.. ఒకరు స్పాట్ డెడ్

పుంగనూరు మండలం నూతన బైపాస్ మలుపు వద్ద పలమనేరు నుంచి పుంగనూరుకు వస్తున్న RTC బస్సు బైకును ఢీకొనడంతో గుడిసి బండకు చెందిన సోమశేఖర్(27) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి ఏఎస్ఐ అశ్వత్ నారాయణ, పోలీసు సిబ్బంది చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 30, 2025
సంక్రాంతి రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు కీలక రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసింది. విశాఖపట్నం-తిరుపతి, విశాఖ-బెంగళూరు, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్ వంటి 9 జతల రైళ్లకు జనవరి 1 నుండి వివిధ తేదీల్లో అదనపు ఏసీ, స్లీపర్ కోచ్‌లను జత చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రశాంత్ ఎక్స్‌ప్రెస్‌లో అదనపు 3rd AC కోచ్‌ను కూడా చేర్చారు.


