News November 15, 2025
పెద్దపల్లి టాస్క్ సెంటర్ విజయం.. 9 మందికి టెలిపర్ఫార్మెన్స్‌లో ఉద్యోగాలు

PDPL టాస్క్ రీజినల్ సెంటర్ శిక్షణతో జిల్లాకు చెందిన 9మంది విద్యార్థులు టెలిపర్ఫార్మెన్స్ కంపెనీలో కంటెంట్ మోడరేటర్‌గా ఎంపికయ్యారు. యూట్యూబ్ ప్రాజెక్ట్‌లో వారికి అవకాశం లభించింది. నైపుణ్యాభివృద్ధి, కమ్యూనికేషన్ శిక్షణ, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా టాస్క్ అందిస్తున్న కోర్సులు యువత భవిష్యత్తుకు దారి చూపుతున్నాయని అధికారులు తెలిపారు. జిల్లాలోని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
Similar News
News November 15, 2025
వాంకిడి: ‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి’

వాంకిడి మండలం ఖమన గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం ఆయన ఖమన గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తుందన్నారు.
News November 15, 2025
కామారెడ్డి: హైవేపై ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం

కామారెడ్డి జిల్లా బిక్కనూర్(M) సిద్ధిరామేశ్వర్ నగర్ శివారులో శనివారం రాత్రి మహారాష్ట్ర నుంచి వస్తున్న కామాక్షి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం తప్పింది. వేగ నియంత్రణ కోసం పోలీసులు ఏర్పాటు చేసిన డ్రమ్ములను ఢీకొంది. ఆ సమయంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడుపుతున్నట్లు SI ఆంజనేయులు తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
News November 15, 2025
‘చలో ఖమ్మం’ సభను విజయవంతం చేయాలి

సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. జోడేఘాట్‌లో ప్రచార జాతాను ప్రారంభించిన అనంతరం ఆయన కొమురం భీమ్ సమాధి వద్ద నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో సీపీఐ పాత్రను గుర్తుచేస్తూ, ఈ జాతా జోడేఘాట్ నుంచి భద్రాచలం వరకు కొనసాగుతుందని నాయకులు తెలిపారు.


