News December 29, 2025
పెద్దపల్లి: ట్రాన్స్‌జెండర్‌లకు స్వయం ఉపాధి అవకాశాలు: కలెక్టర్

పెద్దపెల్లి జిల్లాలో నివసిస్తున్న 18- 55 ఏళ్ల ట్రాన్స్‌జెండర్లు స్వయం ఉపాధి కోసం జనవరి 10లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ ద్వారా PDPL జిల్లాకు 2 యూనిట్లకు రూ.1,50,000 మంజూరు చేసిందన్నారు. దరఖాస్తులు IDOC రూమ్ నం.114, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలి. వివరాలకు 994949461, 9440852495లను సంప్రదించవచ్చు.
Similar News
News December 30, 2025
గ్రూప్-2 రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ల కొట్టివేత

AP: గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ల పాయింట్లను సవాల్ చేస్తూ 2023లో ఇచ్చిన గ్రూప్-2 నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్ పాటించాలని కోరారు. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.
News December 30, 2025
అరటి గెలల నాణ్యత పెరగాలంటే?

అరటిలో పండు పరిమాణం, నాణ్యత పెంచేందుకు గెలల్లోని ఆఖరి హస్తం విచ్చుకున్న 5వ రోజు మరియు 15వ రోజున లీటరు నీటికి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 గ్రాములను కలిపి గెలలపై పిచికారీ చేయాలి. దీనితో పాటు 2 శాతం రంద్రాలు చేసిన తెల్లని పారదర్శక పాలిథీన్ సంచులను గెలలకు తొడగాలి. దీని వల్ల అరటిపండ్ల పరిమాణం పెరిగి లేత ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా తయారై నాణ్యమైన పండ్లను పొందవచ్చు. ఇవి ఎగుమతికి అనుకూలంగా ఉంటాయి.
News December 30, 2025
ఈ ఏడాది నేరాలను తగ్గుముఖం పట్టించాం: విశాఖ సీపీ

విశాఖలో పోలీసులు చేసిన కృషి వల్ల 17 విభాగాల్లో గత ఏడాది కంటే నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్య తగ్గించగలిగామని సీపీ శంఖబత్ర భాగ్చీ వెల్లడించారు. వార్షిక ముగింపులో భాగంగా ఆయన మాట్లాడారు. గత ఏడాది 5,921 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 5,168 కేసులు నమోదయ్యాయని చెప్పారు. మర్డర్ కేసులు 35 నమోదు కాగా.. కిడ్నాప్ కేసులు 17, హత్యాయత్నం కేసులు 135 నమోదు చేసినట్లు తెలిపారు.


