News September 11, 2025

పెద్దపల్లి: డిజిటల్ తరగతులు పిల్లలకు కొత్త అవకాశాలు: కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు తోడ్పడతాయని మంథని పర్యటనలో భాగంగా పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. టీచ్ ఫర్ చేంజ్ అందిస్తున్న కరికులంను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రహరీ గోడలు, టాయిలెట్స్, అదనపు తరగతులు, మరమ్మతులు చేపట్టినట్లు వివరించారు.

Similar News

News September 11, 2025

HYDలో ‘U TURN’ తీసుకున్న ట్రాఫిక్ కష్టాలు

image

సీటీలో యూ టర్న్‌లు ట్రాఫిక్ సమస్యలకు కేంద్రాలుగా మారాయని పలువురు మండిపడుతున్నారు. ఇబ్బందులులేని చోట ట్రాఫిక్ సమస్యలు U TURN తీసుకున్నాయని విమర్శిస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వరకు రష్ టైమ్‌లో యూటర్న్‌ల వద్ద వాహనాలు తిరుగుతుంటే లక్డీకపూల్ వరకు జామ్ అవుతుందని వాపోతున్నారు. నాగోల్‌లో మెట్రో దిగితే ఉప్పల్ వరకు U TURN లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

News September 11, 2025

NLG: అధికారుల ఐడియా అదుర్స్ గురూ..!

image

వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్న దృష్ట్యా, ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. స్థానిక సంస్థల ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ ఆధ్వర్యంలో ఈ నెల 13న నల్గొండలోని మిర్యాలగూడ రోడ్డులో ఉన్న రామ్‌‌నగర్ పార్క్‌లో పెద్ద ఎత్తున కుక్కల దత్తత కార్యక్రమం నిర్వహించనున్నారు. కుక్కల పట్ల ప్రేమ ఉన్నవారు వాటికి తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించి దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

News September 11, 2025

సోనియా గాంధీకి కోర్టులో ఊరట

image

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. భారత సిటిజన్ అవ్వకముందే ఆమె ఓటు హక్కు పొందారని, విచారణ జరపాలని న్యాయవాది వికాస్ త్రిపాఠి పిటిషన్ దాఖలు చేశారు. ‘1980లో సోనియా ఓటు హక్కు పొందారు. ఆ తర్వాత 1982లో ఎన్నికల సంఘం దాన్ని తొలగించింది. అంటే ఆమె అక్రమంగా ఓటర్ ఐడీ పొందారని స్పష్టమవుతోంది’ అని అందులో పేర్కొన్నారు. దీనిపై విచారించిన కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది.