News September 23, 2025
పెద్దపల్లి: నిన్న అలా.. నేడు ఇలా..!

బతుకమ్మ సందర్భంగా ఎంగిలిపూల బతుకమ్మ రోజు ఉన్న క్రేజ్ మిగతా రోజుల్లో ఉండట్లేదు. తొమ్మిది రోజులు జరుపుకునే ఘనమైన పండుగ బతుకమ్మ. కానీ, నేటి మహిళలు కేవలం మొదటి రోజు, చివరి రోజు మాత్రమే వేడుకలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎంగిలిపూల బతుకమ్మ రోజు దేవాలయాలు, చెరువుల వద్ద మహిళలు కిటకిటలాడగా, రెండో రోజు అసలు బతుకమ్మ ఊసే ఎత్తట్లేదు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం.
Similar News
News September 23, 2025
కరీంనగర్: బందూకు పట్టిన బడిపంతులు

విద్యాబోధనతో భావి తరాలకు వెలుగులు నింపాల్సిన చేతులు తుపాకీ పట్టి, విప్లవ పోరాటంలో కనుమరుగయ్యాయి. ఉమ్మడి KNR(D) కోహెడ(M) తీగలకుంటపల్లికి చెందిన కట్టా రామచంద్రారెడ్డి.. ఒకప్పుడు భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1989లో విప్లవోద్యమానికి ఆకర్షితులై, భార్యతో కలిసి పీపుల్స్ వార్‌లో చేరారు. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో సోమవారం రామచంద్రారెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే.
News September 23, 2025
GST 2.0పై కేంద్రానికి ఫిర్యాదుల వెల్లువ!

GST కొత్త శ్లాబులు అమలులోకి వచ్చినా కొన్ని ఇ-కామర్స్ సైట్స్ ప్రయోజనాలను బదిలీ చేయట్లేదని కేంద్రానికి ఫిర్యాదులొచ్చాయి. వీటిపై కేంద్రం ఆరా తీస్తోంది. ‘ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించలేం. అన్ని సైట్లలో ధరల మార్పులను గమనిస్తున్నాం. సెప్టెంబర్ 30 కల్లా ఓ నివేదిక వస్తుంది’ అని కేంద్రం తెలిపింది. మీకూ ఇలాంటి అనుభవమే ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 1915, www.consumerhelpline.gov.inలో ఫిర్యాదు చేయొచ్చు.
ShareIt.
News September 23, 2025
ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో అతిపెద్ద బతుకమ్మ

ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం అతిపెద్ద బతుకమ్మ వేడుకలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా 60 అడుగుల ఎత్తు ఉన్న బతుకమ్మను పూలతో తయారు చేయనున్నారు. ఈ వేడుకల్లో పది వేల మంది మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడనున్నారు. ఇది గిన్నిస్ రికార్డుకు ప్రయత్నం కానుంది.