News March 18, 2025
పెద్దపల్లి: నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం

రాజీవ్ యువ వికాసంతో పెద్దపెల్లి జిల్లా యువతకు సువర్ణ అవకాశం లభించింది. SC, ST, BC, మైనార్టీల నిరుద్యోగ యువతకు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అందజేయనున్నది. దీనికి కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కులం, ఆదాయ సర్టిఫికెట్లు, ఫోటో, బ్యాంకు ఖాతా బుక్, ఫోన్ నంబర్ ఆన్లైన్లో ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. ఈ పథకం కింద యువతకు 3 లక్షల వరకు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 18, 2025
ముగిసిన పోసాని సీఐడీ కస్టడీ

AP: సినీ నటుడు, వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి ఒక రోజు సీఐడీ కస్టడీ ముగిసింది. దీంతో ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని ఈ ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. మరోసారి ఆయన్ను కస్టడీకి కోరే అవకాశం ఉంది.
News March 18, 2025
కొండగట్టులో గుర్తుతెలియని కుళ్ళిన మృత దేహం

గుర్తుతెలియని కుళ్ళిన మృతదేహం లభ్యమైన ఘటన కొండగట్టు దిగువ ప్రాంతంలోని తుమ్మచెరువు ప్రాంతంలో మంగళవారం జరిగింది. విషయం తెలుసుకున్న మల్యాల ఎస్సై నరేష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాదాపు 20 రోజుల క్రితం మృతి చెందడంతో శవం పూర్తిగా కుళ్లిపోయి అస్తిపంజరంగా మారింది. మృతిచెందిన వ్యక్తి ఎవరు.. ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.
News March 18, 2025
భార్య, అత్త వేధింపులు.. భర్త ఆత్మహత్య

TG: భార్యల వేధింపులతో తనువు చాలిస్తున్న భర్తల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా HYDలో అబ్దుల్ జమీర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరివేసుకున్నాడు. భార్య, అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానని అతను స్నేహితులతో చెప్పుకునేవాడని సమాచారం. అబ్దుల్ సూసైడ్ చేసుకున్న రోజు ఇంట్లో వారిద్దరూ ఉన్నారని, అతను చనిపోయాక అనంతపురానికి వెళ్లారని తెలుస్తోంది. శనివారం ఈ ఘటన జరగగా సోమవారం చెడువాసన రావడంతో విషయం బయటికొచ్చింది.