News October 10, 2025
పెద్దపల్లి: నిర్దిష్ట గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండంలో పలు అభివృద్ధి పనులను పరిశీలిస్తూ, నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ఏటీసీ కేంద్రాల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. పాఠశాలల భవన నిర్మాణం, పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. క్రిటికల్ కేర్ భవనం 15 రోజుల్లో పూర్తిచేసి అప్పగించాలని, సదరన్ క్యాంప్ వారం రోజుల్లో ప్రారంభించాలని ఆదేశించారు.
Similar News
News October 10, 2025
వరంగల్: గంజి, గటకే వారి కడుపునింపింది!

‘ఏళ్ల తరబడి కూడుకేడ్చాం.. గూడుకేడ్చాం.. గుడ్డకేడ్చాం’ అనే ఓ సినామాలోని డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలోనే ఎనకటి రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని లక్షలమంది తినడానికి తిండిలేక అనేక అవస్థలు పడ్డారు. గటక, గంజి తాగి ఏళ్ల తరబడి బతికారు. పండగ రోజు మాత్రమే అన్నం తినేవారు. మిగతా రోజుల్లో గంజి మాత్రమే వారి ఆహారం. అందులోని పోషకాలతో నేటికీ ఆరోగ్యంగా ఉండటం విశేషం. నేడు ప్రపంచ గంజి దినోత్సవం. SHARE IT.
News October 10, 2025
NLG: ప్రజల బాణీ.. పోరాటపు వాణి!

‘పల్లెటూరి పిల్లగాడ’ పాటతో తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన అచ్చమైన ప్రజా కవి సుద్దాల హనుమంతు. నిరంకుశ నిజాం రాజ్యంలో, భూస్వాముల కర్కషత్వం కింద నలిగిపోతున్న అమాయక ప్రజల స్థితిగతులను ఆయన తన గేయాలతో కళ్లకు కట్టారు. ప్రజలను వెన్నుతట్టి పోరాటానికి సిద్ధం చేశారు. నాటి నిజాం వ్యతిరేకోద్యమంలో బతికున్నంతకాలం ప్రజల బాణీలోనే పాటలందించి, తన జీవితాన్ని పోరాటాలకే అంకితం చేశారు.
News October 10, 2025
ఖమ్మం: ఎన్నికలకు బ్రేక్.. ఆశావహుల కలలు ఆవిరి

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు స్టే విధించడంతో జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. 42% రిజర్వేషన్ ఆధారంగా పోటీ చేయాలనుకున్న ఉమ్మడి జిల్లాలోని బీసీ ఆశావహుల కలలు ఆవిరయ్యాయి. దీంతో బీసీలకు నిరాశే మిగిలిందని తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఆదేశాలతో జిల్లా అధికారులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను (ఎంసీసీ) ఎత్తివేశారు. ఇక కొత్త నోటిఫికేషన్‌పై ఉత్కంఠ నెలకొంది.