News February 11, 2025

పెద్దపల్లి: నేటి నుంచి భాగ్యనర్ ఎక్స్‌ప్రెస్

image

పెద్దపల్లి జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11 రోజులు రద్దు కావాల్సిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 11 నుంచి 14 వరకు పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. నేడు SECలో బయల్దేరి కాజీపేట మీదుగా కాగజ్‌నగర్‌(ఈనెల11 నుంచి 14)కు వెళ్తుందని, మళ్లీ 12న కాగజ్‌నగర్ నుంచి SEC(ఈనెల 12-15)వరకు నడపనున్నట్లు అధికారులు ఉత్తర్వులో పేర్కొన్నారు.

Similar News

News February 26, 2026

VKB: పరీక్షా కేంద్రాల వద్ద ఇవి బంద్

image

జిల్లాలో నేడు ఇంటర్ 2nd ఇయర్ పరీక్షకు 8,006 మంది విద్యార్థులు హాజరుకానునట్లు జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి తెలిపారు. గురువారం లాంగ్వేజ్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇందుకు 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు. పరీక్షా సెంటర్ల వద్ద జిరాక్స్, ప్రింటింగ్‌ షాపులు బంద్ చేయాలని ఆదేశించారు.

News February 26, 2026

నేడు ఖమ్మంలో టెన్షన్.. టెన్షన్..!

image

ఖమ్మం వెలుగుమట్లలో రూ.250 కోట్ల విలువైన 31.07 ఎకరాల భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. 600ఇళ్లు తొలగించడంతో రోడ్డున పడ్డ బాధితులకు అన్ని వైపుల నుంచి మద్దతు పెరుగుతోంది. పేదలకు 2BHKఇళ్లు కేటాయించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పేదలను మోసం చేసి, భూములు అమ్మిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. BRS నేత KTR నేడు బాధితుల పరామర్శకు రానుండడంతో టెన్షన్ నెలకొంది.

News February 26, 2026

మార్కాపురంలో సీఎంను ఆకట్టుకున్న విద్యార్థిని చిత్రలేఖనం

image

మార్కాపురం బహిరంగ సభలో ఓ విద్యార్థిని గీసిన చిత్రలేఖనం సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మార్కాపురం జిల్లా చెన్నకేశవ స్వామి గోపురం, సీఎం చిత్రాల అందంగా ఉండడంతో విద్యార్థినిని సీఎం అభినందించారు. ఈ చిత్రలేఖనంలో చాలా అర్థం దాగి ఉందని ప్రజలకు వివరించారు. ఆ దేవుడితో పెట్టుకుంటే పతనం ఖాయమని హెచ్చరించారు.