News March 10, 2025

పెద్దపల్లి: నేడు ప్రజావాణి పునః ప్రారంభం

image

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం ఉదయం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో భాగంగా తాత్కాలికంగా కొద్ది వారాల పాటు రద్దు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో తిరిగి ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 10 సోమవారం తిరిగి పునః ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పేర్కొన్నారు. కావున జిల్లాలోని అర్జీదారులు వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News February 15, 2026

కరీంనగర్ మేయర్ పీఠం కమలం వశమే!

image

కరీంనగర్ నగరపాలక సంస్థలో కమల వికాసం ఖాయమైంది. బీజేపీ గెలిచిన 30 స్థానాలకు తోడు, ఇప్పటికే ఇద్దరు చేరగా.. తాజాగా శనివారం మరో ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో బీజేపీ బలం ఎక్స్-అఫీషియో ఓటుతో కలిపి 35కు చేరి, మ్యాజిక్ ఫిగర్ (34) దాటింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలకు తాజా చేరికలతో గండిపడింది.

News February 15, 2026

శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!

image

ఇవాళ మహా శివరాత్రి సందర్భంగా భక్తులు <<19142196>>ఉపవాస దీక్షలు<<>> ఆచరిస్తారు. అయితే పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘శరీరం డీహైడ్రేట్ కాకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు’ అని చెబుతున్నారు. ఉపవాసం తర్వాత భారీగా తినొద్దని, ముందు తేలికైన ఆహారంతో ప్రారంభించాలని పేర్కొంటున్నారు.

News February 15, 2026

KRI: DJ శబ్దాలు.. కట్టడి కరవు?

image

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల్లో భారీ స్థాయిలో ప్రభలను ఏర్పాటు చేశారు. ప్రభల వద్ద కొందరు నిర్వాహకులు DJల ఏర్పాటుతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవి అశ్లీల పాటలతో హోరెత్తించనున్నాయని ప్రజలు వాపోతున్నారు. గతంలో DJ శబ్దాల వల్ల అనేకమంది గుండెపోటుకు గురయ్యారని పేర్కొన్నారు. అధికారులు ఆ బాక్సుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.