News March 19, 2025

పెద్దపల్లి: నేడు 186 మంది గైర్హాజరు

image

పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని జిల్లా నోడల్ అధికారి కల్పన పేర్కొన్నారు. రసాయనశాస్త్రం, కామర్స్ పేపర్లకు పరీక్షలు జరిగాయన్నారు. 4984 విద్యార్థులకు గాను 4798 హాజరయ్యారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 186 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఈ పరీక్షల్లో జనరల్ 106 మంది, వొకేషనల్ 80మంది విద్యార్థులు హాజరు కాలేదన్నారు.

Similar News

News February 26, 2026

బ్రహ్మాస్త్రం తయారీ.. ఎలా ఉపయోగించాలి?

image

వేప, సీతాఫలం, పల్లేరు, ఉమ్మెత్త ఆకులను మెత్తగానూరి ముద్దలా తయారు చేయాలి. ఒక పాత్రలో 10 లీటర్ల ఆవు మూత్రం, ఆకుల ముద్దను వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మూతపెట్టి బాగా ఉడికించి పొయ్యి మీద నుంచి దించి.. 48 గంటల పాటు చల్లారనివ్వాలి. తర్వాత గుడ్డతో వడకడితే బ్రహ్మాస్త్రం సిద్ధమైనట్లే. ఎకరాకు 100 లీటర్ల నుంచి 2 లేదా రెండున్నర లీటర్ల బ్రహ్మాస్త్రం కలిపి పిచికారీ చేయాలి. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.

News February 26, 2026

రాజమండ్రి: కల్తీ పాలను చిటికెలో కనిపెట్టండి ఇలా!

image

నిత్యం మనం వాడే పాలు కల్తీ అవుతున్నాయా? ఈ చిన్న పరీక్షలతో సులభంగా తెలుసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాలు సహజ సిద్ధమైన తీపి, క్రీమ్ వాసన కలిగి ఉంటాయని, చేదుగా లేదా రసాయన వాసన వస్తే అవి కల్తీవని గుర్తించాలి. కొద్దిపాటి పాలలో రెండు చుక్కల అయోడిన్ ద్రావణం కలిపినప్పుడు, ఆ పాలు నీలి రంగులోకి మారితే అందులో పిండి లేదా స్టార్చ్ కలిపినట్లు నిర్ధారించుకోవాలని నిపుణులు తెలిపారు.

News February 26, 2026

డయేరియా.. శ్రీకాకుళానికి రూ.118 కోట్లు

image

శ్రీకాకుళం నగరంలో తాగునీరు, డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి పనుల కోసం రూ.118 కోట్లు కేటాయిస్తున్నామని మంత్రి నారాయణ బుధవారం వెల్లడించారు. దమ్మలవీధి, మొండేటి వీధి, కండ్రవీధి, ఎచ్చెర్ల వీధి ప్రాంతాల్లో ప్రబలిన డయేరియా అదుపులోకి వచ్చిందన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి బాధిత ప్రాంతాల్లో పర్యటించారు.