News March 15, 2025
పెద్దపల్లి: నేడు 209 మంది గైర్హాజరు

పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఇంటర్మీడియట్ రెండోవ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని జిల్లా నోడల్ అధికారి కల్పన పేర్కొన్నారు. గణితం B, జీవ శాస్త్రం, చరిత్ర పేపర్లకు పరీక్షలు జరిగాయన్నారు. 3895 విద్యార్థులకు గాను 3647 హాజరయ్యారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 248 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఈ పరీక్షల్లో జనరల్ 209 మంది, వొకేషనల్ 39మంది విద్యార్థులు హాజరు కాలేదన్నారు.
Similar News
News March 15, 2025
‘ఫోటో ఓటర్ జాబితా తయారీకి ప్రతి ఒక్కరు సహకరించాలి’

పారదర్శక, స్వచ్ఛమైన ఫోటో ఓటరూ జాబితా తయారీలో భాగంగా నిరంతర మార్పులు, చేర్పుల విషయంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికిసహకరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓటరూ జాబితా తయారీలో ఎప్పటికప్పుడు వస్తున్నమార్పులు, చేర్పులు, తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం నల్గొండ కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు.
News March 15, 2025
సంగారెడ్డి: ‘పరీక్షకు 239 మంది విద్యార్థులు గైర్హాజరు’

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 96.81% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.13,987 మంది విద్యార్థులకు గాను 13,748 మంది విద్యార్థులు హాజరయ్యారని, 239 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
News March 15, 2025
భీమవరంలో యువతి ఆత్మహత్యాయత్నం

భీమవరం డీఎన్ఆర్ కళాశాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని చిన్న వంతెన మీద నుంచి మురికి కాలవలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు, శ్రీనివాస్ అనే యువకుడు ఆ యువతిని రక్షించారు. యువతికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమస్య ఏంటి అని అడగ్గా తమ తల్లిదండ్రులు విడిపోతున్నారని బాధతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపింది.