News March 5, 2025

పెద్దపల్లి: నేడే పరీక్షలు.. ALL THE BEST

image

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 10,985 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఫస్టియర్ 5,844, సెకండియర్‌లో 5,141 మంది విద్యార్థులు రాయనుండగా.. 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో BNS 163(144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక నిమిషం ఆలస్యాన్ని తాజాగా 5 నిమిషాలకు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ALL THE BEST

Similar News

News March 5, 2025

వికారాబాద్ జిల్లాలో బుధవారం ముఖ్యాంశాలు

image

✓ కొడంగల్, దుద్యాలలో అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.✓ కొడంగల్: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గిరిజనుల పాలాభిషేకం.✓ VKB జిల్లాలో మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.✓ కొడంగల్: పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల బిల్లులు కలెక్టర్‌కు మాజీ కలెక్టర్‌కు పాఠశాలలో AI తరగతులను పరిశీలించిన బెంగుళూరు బృందం.✓VKB:విద్యార్థినిని పరామర్శించిన స్పీకర్

News March 5, 2025

విశాఖ చేరుకున్న కేంద్రమంత్రి నిర్మల సీతారామన్

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్రమంత్రికి ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ చేరుకున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర ముఖ్య అధికారులు, బీజేపీ నాయకులు కేంద్రమంత్రికి స్వాగతం పలికారు.

News March 5, 2025

విద్యార్థులు ఇలా చేస్తే పరీక్షలు ఈజీగా రాయొచ్చు!

image

☛ ఎగ్జామ్ టైమ్‌లో క్వశ్చన్ పేపర్ మొత్తం చదివి, ముందుగా తెల్సినవి రాయాలి. ఇలా చేస్తే టైమ్ వేస్ట్ అవ్వదు.
☛ పరీక్షలకు ముందు చదవడంతో పాటు రాయడం ప్రాక్టీస్ చేయాలి.
☛ క్లాస్‌లు జరుగుతున్నప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. ఫాస్ట్‌గా రాయడం అలవాటౌతుంది.
☛ ఓల్డ్ క్వశ్చన్ పేపర్లను ప్రాక్టీస్ చేయడంతో పాటు ప్రీ ఫైనల్స్ రాయాలి. దీని వల్ల టైమ్ మేనేజ్‌మెంట్ అలవడుతుంది.

error: Content is protected !!