News February 27, 2025

పెద్దపల్లి: నేడే పోలింగ్.. అంతా రెడీ!

image

నేడు జరగనున్న KNR, MDK, ADB, NZB పట్టభద్రుల, టీచర్ MLC ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. జిల్లాలో పట్టభద్రులు 31,037, ఉఫాధ్యాయులు 1,111 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రుల కోసం 36, ఉపాధ్యాయుల కోసం 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పట్టభద్రుల బరిలో 56మంది, ఉపాధ్యాయ స్థానంలో 15మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3 వరకు వేచి ఉండాల్సిందే. 144 సెక్షన్ అమలులో ఉంటుంది.

Similar News

News November 5, 2025

బాపట్ల: మద్యం తాగి బస్సు నడుపిన డ్రైవర్

image

బాపట్ల జిల్లా SP ఆదేశాల మేరకు మార్టూరు సీఐ శేషగిరిరావు, రవాణాశాఖ అధికారులు NH–16పై మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అతివేగంగా వస్తున్న ఇంటర్ సిటీ స్మార్ట్ బస్‌ను తనిఖీ చేయగా.. డ్రైవర్ మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బస్ డ్రైవర్‌ను తనిఖీ చేయకుండా పంపిన మేనేజర్, కెప్టెన్‌లపై కూడా చర్యలు చేపట్టారు.

News November 5, 2025

న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్‌దానీ

image

అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్ నగర మేయర్‌గా జోహ్రాన్ మమ్‌దానీ (34) ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ముస్లిం, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ శతాబ్దంలో అత్యంత పిన్న వయసులో న్యూయార్క్ మేయర్ అయిన ఘనత కూడా ఈయనదే. డెమొక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసిన జోహ్రాన్ స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూపై గెలిచారు. మమ్‌దానీ తల్లిదండ్రులు ఇండియాలో జన్మించారు.

News November 5, 2025

ఆలయాల వద్ద పటిష్ఠ బందోబస్తు: వరంగల్ సీపీ

image

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయాల వద్ద పటిష్ఠమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన ఘటన దృష్టిలో ఉంచుకుని తోపులాటలు లేకుండా భక్తులు క్యూలైన్లలో కొనసాగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది సాయం తీసుకోవాలని సీపీ పేర్కొన్నారు.