News January 1, 2026

పెద్దపల్లి: పంచాయతీరాజ్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ

image

పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం పెద్దపల్లి జిల్లా శాఖ ఉద్యోగుల క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రంగు రవి, గౌరవ అధ్యక్షులు ఎం.రమేష్, ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డితో పాటు పూర్ణచంద్ర రావు, కరుణాకర్, సాదిక్ పాషా, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సిబ్బంది హాజరయ్యారు.

Similar News

News February 10, 2026

పోలవరం: చుక్కల్లో వేరుసెనగ ధర.. సామాన్యుడి బేజారు

image

వేరుసెనగ ధర సామాన్యులకు భారంగా మారింది. పోలవరం జిల్లాలోని రంపచోడవరం, అడ్డతీగల, చింతూరు ప్రాంతాల్లో మంగళవారం కిలో ధర రూ.180 నుంచి రూ. 200లకు చేరింది. గత నెలలో రూ.120 ఉండగా, దిగుబడి తగ్గడంతో ఒక్కసారిగా రేటు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. రాజమండ్రి, ఏలేశ్వరం నుంచి దిగుమతులు తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.

News February 10, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరులో మంగళవారం బంగారం, వెండి ధరల వివరాలు:
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.15,950
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.14,674
* 10 గ్రాముల వెండి ధర: రూ.2,670.

News February 10, 2026

HYD: 1,926 సమస్యాత్మక ప్రాంతాలు: DGP

image

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. 1,926 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించామని, హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నారు. 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిద్ధం చేశామని, 167 సర్వైలెన్స్ టీమ్స్ విధుల్లో ఉన్నారన్నారు. పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.