News November 15, 2025

పెద్దపల్లి: పత్తి కొనుగోళ్లు నిలిపివేత.. రైతులు కలెక్టర్ సూచన

image

CCI జిన్నింగ్ మిల్లులపై విధించిన నిబంధనల సడలింపు వచ్చే వరకు NOV 17నుంచి రాష్ట్రవ్యాప్తంగా CCI, ప్రైవేట్ పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పెద్దపల్లి కలెక్టర్ తెలిపారు. రైతులు మార్కెట్‌ యార్డులకు, జిన్నింగ్ మిల్లులకు పత్తి తీసుకురావొద్దని, స్లాట్ బుకింగ్ ఉన్నవారూ కూడా పత్తి తీసుకురావొద్దని సూచించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పత్తి అమ్మకాలపై రైతులు ఆగాలని కలెక్టర్ విజ్ఞప్తిచేశారు.

Similar News

News November 15, 2025

వాంకిడి: ‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి’

image

వాంకిడి మండలం ఖమన గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం ఆయన ఖమన గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తుందన్నారు.

News November 15, 2025

కామారెడ్డి: హైవేపై ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం

image

కామారెడ్డి జిల్లా బిక్కనూర్(M) సిద్ధిరామేశ్వర్ నగర్ శివారులో శనివారం రాత్రి మహారాష్ట్ర నుంచి వస్తున్న కామాక్షి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం తప్పింది. వేగ నియంత్రణ కోసం పోలీసులు ఏర్పాటు చేసిన డ్రమ్ములను ఢీకొంది. ఆ సమయంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడుపుతున్నట్లు SI ఆంజనేయులు తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

News November 15, 2025

‘చలో ఖమ్మం’ సభను విజయవంతం చేయాలి

image

సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. జోడేఘాట్‌లో ప్రచార జాతాను ప్రారంభించిన అనంతరం ఆయన కొమురం భీమ్ సమాధి వద్ద నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో సీపీఐ పాత్రను గుర్తుచేస్తూ, ఈ జాతా జోడేఘాట్ నుంచి భద్రాచలం వరకు కొనసాగుతుందని నాయకులు తెలిపారు.