News November 19, 2025

పెద్దపల్లి: పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రికి ఎంపీ లేఖ

image

తెలంగాణ పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాసినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర సగటు పత్తి దిగుబడిని 11.74 క్వింటాళ్లుగా కొనసాగించాలని, అలాగే పత్తిలో మాయిశ్చర్‌ పరిమితిని 20 శాతం వరకు సడలించాలని లేఖలో విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. మిల్లర్లు అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కూడా ఎంపీ కోరినట్లు తెలిపారు.

Similar News

News March 4, 2026

మళ్లీ ఘాటెక్కిన ఒంగోలు రాజకీయం

image

ఒంగోలు రాజకీయం మళ్లీ ఘాటెక్కింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. డ్వాక్రా గ్రూపుల్లో అవినీతి జరిగిందని, అది ఎవరు చేశారో ఒంగోలులోని ప్రజలకు తెలుసు అని బాలినేని పేర్కొన్నారు. ఇప్పటికే దీనిపై ఫిర్యాదు చేశామని, ఆయన కూడా ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉన్నారని, కలెక్టర్‌తో స్పెషల్ ఎంక్వైరీ వేపించుకోవాలని దామచర్ల సమాధానం ఇచ్చారు.

News March 4, 2026

సంగారెడ్డి: రెండేళ్లుగా లవ్❤︎.. నర్సు సూసైడ్!

image

HYDలో ప్రేమ విఫలమై సోనూబాయి(20) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. నారాయణఖేడ్‌కు చెందిన ఆమె మియాపూర్‌లో ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఓ యువకుడితో రెండేళ్లుగా ప్రేమలో ఉంది. ఇద్దరికీ కొద్ది రోజులుగా గొడవ జరుగుతున్నాయి. దీంతో యువకుడు మాట్లాడడం లేదు. ఫోన్ ఎత్తడం లేదు. దీంతో మనస్థాపం చెందిన సోనూ హాస్టల్ గదిలో ఉరేసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 4, 2026

కర్నూలు: ఎండల ఎఫెక్ట్.. వడదెబ్బతో సర్పంచ్ భర్త మృతి

image

ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం కర్నూలులో 39 డిగ్రీలు, నంద్యాలలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. కాగా, నంద్యాల(D) జూపాడు బంగ్లా(M) తాటిపాడు సర్పంచ్ వంగల లక్ష్మీదేవి భర్త కృష్ణారెడ్డి(62) వడదెబ్బతో మృతిచెందారు.