News November 7, 2025
పెద్దపల్లి: ‘పాఠశాలలను రెగ్యులర్‌గా తనిఖీ చేయాలి’

PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రభుత్వ పాఠశాలలను రెగ్యులర్‌గా తనిఖీ చేసి విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలని ఆదేశించారు. మండల విద్యాధికారులు ఫీల్డ్ విజిట్‌లతోపాటు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాల వివరాలు NOV 10లోపు సమర్పించాలన్నారు. ప్రతిరోజు విద్యార్థులకు గంటసేపు రీడింగ్ స్కిల్స్‌పై దృష్టిపెట్టాలని, మధ్యాహ్న భోజన నాణ్యతపై 5% పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు జరుపుతామన్నారు.
Similar News
News November 8, 2025
త్వరలో రూ.8 కోట్లు విడుదల: కలెక్టర్

మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లి పంటకు రూ.10 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, మిగిలిన రూ.8 కోట్లు త్వరలోనే జమ చేస్తామని కర్నూలు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంతో సాంకేతిక పరిజ్ఞానం, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలులో తేమశాతం 13-14% ఉన్నా కొనుగోలు చేయాలన్నారు.
News November 8, 2025
నేడు ములుగు జిల్లాలో కరెంట్ కట్

మరమ్మతుల్లో భాగంగా శనివారం ఉ.10 గంటల నుంచి ఉ.11:30 గంటల వరకు ములుగు జిల్లా వ్యాప్తంగా 33/11 కేవీ సబ్ స్టేషన్ల పరిధిలో కరెంట్ ఉండదని డీఈ నాగేశ్వరరావు తెలిపారు. ములుగు, పత్తిపల్లి, మల్లంపల్లి, రామచంద్రపూర్, కాటాపూర్, వెంకటాపూర్, వెల్తుర్లపల్లి, మల్లూరు, కమలాపూర్, రాజుపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, ధర్మారం, నూగూరు, వెంకటాపురం సబ్ స్టేషన్ల పరిధిలో సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.
News November 8, 2025
గ్రేవ్ క్రైమ్ కేసుల్లో ముద్దాయిల కదలికలపై ప్రత్యేక నిఘా ఉండాలి: ఎస్పీ

నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా గ్రేవ్, పెండింగ్ కేసుల ఇన్వెస్టిగేషన్ అధికారులతో ఎస్పీ సునీల్ షెరాన్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్, మర్డర్, గ్రేవ్ క్రైమ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ తెలిపారు. నేర పరిశోధనలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. పోక్సో కేసుల్లో ఛార్జిషీట్ త్వరగా దాఖలు చేసి, ముద్దాయిలకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.


