News October 24, 2025
పెద్దపల్లి: పాము కాటుతో డిగ్రీ విద్యార్థిని మృతి

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో విషాదం నెలకొంది. రూపునారాయణపేట గ్రామానికి చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న గుర్రం అక్షిత(18) దీపావళి సెలవులకు ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో ఉండగా దురదృష్టవశాత్తు ఆమెను పాము కుట్టింది. స్పందించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News October 24, 2025
హైదరాబాద్ వాతావరణ సమాచారం

నగరంలో ఈ సాయంత్రం ఆకాశం మేఘావృతంగా ఉండి, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీస్తాయని అంచనా వేసింది. ఉదయం వేళ పొగమంచు ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రత 27°C, కనిష్ఠం 22°C గా ఉంటుందని ఉంటుందని పేర్కొంది.
News October 24, 2025
ఓయూ: MA ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షా తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని MA ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూడొచ్చని సూచించారు.
News October 24, 2025
మెదక్: విషాదం.. మృతదేహాల కోసం ఎదురుచూపు..!

మెదక్ మండలం <<18091691>>శివ్వాయిపల్లికి చెందిన<<>> మంగ సిద్ధగౌడ్‌కు ఆనంద్ గౌడ్, రమేశ్ గౌడ్ ఇద్దరు కుమారులు, ఒక కూతురు. ఆనంద్ గౌడ్ దుబాయ్‌లో ఉద్యోగరీత్యా స్థిరపడగా అతడికి పాపన్నపేటకు చెందిన సంధ్యారాణితో వివాహమైంది. వీరికి కుమార్తె చందన(23) బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. కుమారుడు శ్రీవల్లభ గౌడ్ అలహాబాద్‌లో చదువుతున్నాడు. తల్లీకూతుళ్లు కర్నూల్ వద్ద బస్సులో సజీవ దహనం కాగా మృతదేహాల కోసం ఎదురుచూస్తున్నారు.


