News July 7, 2025
పెద్దపల్లి: ‘పీఎం కిసాన్ కోసం రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి’

రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆయా గ్రామాల రైతు వేదికల్లో కొనసాగుతుందని PDPL DAO ఆదిరెడ్డి పేర్కొన్నారు. ఎవరైతే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే PM కిసాన్ నగదు వారి ఖాతాలో జమ అవుతాయని పేర్కొన్నారు. జులై చివరి వారంలో పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయన్నారు. ఈ లోగా రైతులు ఆయా గ్రామాల AEOలను సంప్రదించి రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.
Similar News
News July 7, 2025
JGTL: ‘ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి’

ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరం పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం పలువురి నుంచి ఆమె దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణికి 39 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
News July 7, 2025
MHBD, కేసముద్రానికి డిప్యూటీ సీఎం, మంత్రులు రాక

ఈనెల 8న మహబూబాబాద్, కేసముద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు MLA మురళీ నాయక్ తెలిపారు. రూ.300 కోట్ల పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల కార్యక్రమానికి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వేం నరేందర్ రెడ్డిలు హాజరు కానునట్లు తెలిపారు. సభకు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
News July 7, 2025
దుర్గమ్మ అంతరాలయ, VIP దర్శనాలు నిలిపివేత

AP: ఈనెల 8-10 వరకు విజయవాడ దుర్గమ్మ అంతరాలయ, VIP దర్శనాలను నిలిపేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. శాకంబరీ ఉత్సవాలు, ఆషాఢ సారె సమర్పణ సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. తూ.గో, ప.గో, కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులు, వ్యాపారులు అమ్మవారి అలంకరణకు 150టన్నుల కూరగాయలు, 50టన్నుల పండ్లు స్వచ్ఛందంగా అందజేశారు.