News July 8, 2025
పెద్దపల్లి: పీఎం కుసుమ్ పథకం అమలుపై కలెక్టర్ సమీక్ష

పీఎం కుసుమ్ పథకం అమలుపై కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జులై నెలాఖరు వరకు PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఆసక్తి గల లబ్ధిదారుల ఎంపికతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణం కోసం భూమి లెవెలింగ్ పనులను 9నెలల్లో పూర్తి చేయాలన్నారు. సబ్సిడీ ఉంటుందన్నారు.
Similar News
News July 8, 2025
10న కాకినాడలో జాబ్ మేళా

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 10న 1,310 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వసంతలక్ష్మి మంగళవారం తెలిపారు. దక్కన్ ఫైనాన్స్ కెమికల్స్, ఎస్బీఐ గ్రూపు, అపోలో ఫార్మసీ, పేటీఎం సంస్థలో పనిచేసేందుకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. 18 నుంచి35 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులన్నారు. అభ్యర్థులు 10 గంటలకు ఉపాధి కార్యాలయానికి రావాలని కోరారు.
News July 8, 2025
పంజాగుట్ట సర్కిల్ పరిధిలో భారీగా ట్రాఫిక్

HYDలో రద్దీ రోజు రోజుకూ పెరిగిపోతుంది. పంజాగుట్ట X రోడ్- కోఠి రూట్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వెంగళ్‌రావు పార్క్, పంజాగుట్ట X రోడ్, సుల్తాన్ ఉల్ ఉలూమ్ స్కూల్, చట్నీస్ నుంచి పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్ వైపు పలుచోట్ల ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
News July 8, 2025
వనపర్తి: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు ఈనెల 13 వరకు http://national awardstoteachers.education.gov.in సైట్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.