News December 21, 2025
పెద్దపల్లి: ‘పులి సంచారంపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’

పెద్దపల్లి జిల్లాలోని ఎన్‌టీపీసీ, మల్యాలపల్లి, కుందనపల్లి, రాయదండి, లింగాపూర్, పాముల పేట, మేడిపల్లి, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, కమాన్పూర్, రామగిరి ప్రాంతాలలో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. కావున సంబంధిత మండలాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 9 గంటల మధ్య వ్యవసాయ క్షేత్రాలలో సందర్శించవద్దని తెలిపారు.
Similar News
News December 22, 2025
కరీంనగర్: పల్లె పగ్గాలు చేపట్టనున్న కొత్త సారథులు..!

పల్లెల్లో కొత్త పాలన మొదలుకానుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికైన నూతన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడు విడతలుగా జరిగిన పంచాయతీ సమరంలో విజేతలుగా నిలిచిన అభ్యర్థులు, నేడు అధికారికంగా పల్లె పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఈరోజు ఉదయం 10 గంటలకు పంచాయతీ కార్యదర్శులు వీరితో ప్రమాణం చేయిస్తారు.
News December 22, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 22, 2025
నేడు నెక్లెస్ రోడ్డులో ‘మాక్ డ్రిల్’

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేలా సోమవారం నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో ‘మాక్ ఎక్సర్సైజ్’ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీఆర్ఓ వెంకటాచారి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, హైడ్రా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. విపత్తు వేళ వివిధ శాఖలు సమన్వయంతో ఎలా స్పందించాలనే అంశంపై ఈ విన్యాసాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.


