News March 3, 2025
పెద్దపల్లి: పోలీస్ స్టేషన్‌ను పేల్చి 29 ఏళ్లు

PDPL జిల్లా ఓదెల(M) పొత్కపల్లి పోలీస్ స్టేషన్‌ను మావోయిస్టులు పేల్చిన ఘటనకు నేటితో 29ఏళ్లు. 1996 మార్చి 3న జరిగిన ఈ ఘటనతో దేశమే ఉలిక్కిపడింది. దాడిలో కానిస్టేబుల్ షేక్ దాదా మరణించగా.. అప్పటి SI శ్రీధర్ రావుతో పాటు పోలీస్ సిబ్బందిని నక్సల్స్ అధీనంలోకి తీసుకున్నారు. ఎట్టకేలకు 2003లో అప్పటి SP RS ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కొత్త స్టేషన్‌ను నిర్మించి హోంమంత్రి దేవేందర్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు.
Similar News
News November 10, 2025
సిద్దిపేట: ప్రతిభకు మారుపేరు అందెశ్రీ !

సిద్దిపేట జిల్లా రేబర్తికి చెందిన ప్రజాకవి అందెశ్రీ ఇక లేరన్న విషయం బాధిస్తోంది. ప్రతిభకు మారుపేరుగా నిలిచిన అందెశ్రీ తెలంగాణ ఉద్యమ సమయంలో జిల్లాలో కీలక పాత్ర పోషించారు. ఆయన రాసిన జయజయహే తెలంగాణ జననీ జయకేతనం, పల్లెనీకు వందనములమ్మో, మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు, గలగల గజ్జెలబండి, కొమ్మ చెక్కితే బొమ్మరా.. జన జాతరలో మన గీతం, యెల్లిపోతున్నావా తల్లి పాటలు ప్రసిద్ధి చెందాయి.
News November 10, 2025
జూబ్లీహిల్స్ బై పోల్: డెమో తర్వాత అసలు ఓటింగ్!

రేపు సూర్యుడు ఉదయించే లోపే(5AM) జూబ్లీహిల్స్ బై పోల్‌లో పోటీలో ఉన్న క్యాండిడేట్లందరూ (58 మంది) ఓటేస్తారు. అది తాము వేసిన గుర్తుకే పడిందా? లేదా? అనేది నిర్ధారించుకుంటారు. డెమో ఓకే అయితేనే సంతృప్తి వ్యక్తం చేస్తారు. లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతారు. ఈ తతంగం పూర్తయిన తరువాత మోడల్ బ్యాలెట్ జరిగినట్లు PO అధికారికంగా ధ్రువీకరిస్తారు. ఆ తరువాత ఉదయం 7 గంటలకు అసలు ఎన్నిక మొదలవుతుంది.
News November 10, 2025
తిరుపతి: నాయకులకు దూరంగా పవన్ టూర్…?

రెండు రోజుల పాటు తిరుపతి, చిత్తూరు జిల్లాలో dy.CM పవన్ కళ్యాణ్ టూర్ సాగింది. అయితే ఎమ్మెల్యేలను పవన్ కళ్యాణ్ దగ్గరకు రానీయలేదనే చర్చ సాగుతోంది. తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో సైతం ప్రజా ప్రతినిధులు పాల్గొనలేదట. మామండూరు ఫారెస్ట్ విజిట్‌లో సైతం పవన్ మాత్రమే ఉన్నారు. ఇక రెడ్ శాండిల్ గోడౌన్‌ను పవన్ మాత్రమే సందర్శించారు. పలమనేరులో సైతం ఎమ్మెల్యేలతో అంటీ అంటనట్లు వ్యవహరించారనే వాదన వినిపిస్తోంది.


